Nirav Modi: బ్రిటన్‭లో చివరి అవకాశం కోల్పోయిన నీరవ్ మోదీ.. ఇక చచ్చినట్లు ఇండియాకు రావాల్సిందే

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరమే నీరవ్ మోదీ భారతదేశం వదిలి పారిపోయారు. 13,000 కోట్ల పీఎన్‌బీ కుంభకోణంలో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు. 7,000 కోట్ల రూపాయల విలువైన పీఎన్‌బీని మోసం చేయడం, మనీలాండరింగ్, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, సాక్షులను బెదిరించడం వంటి ఆరోపణలు నీరవ్‭పై చాలా బలంగా ఉన్నాయి

Nirav Modi: భారతీయ బ్యాంకుల్లో వేల కొట్టు కొట్టేసి, కిక్కురు మనకుండా బ్రిటన్ చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఇక చచ్చినట్లు ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన అప్పగింతకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయన, ఈ విషయంలో బ్రిటన్ కోర్టులో అప్పీలు చేసుకునే చివరి అవకాశాన్ని కోల్పోయారు. ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్న నీరవ్ మోదీకి ఇప్పుడు అక్కడ చట్టపరమైన అవకాశాలు లేవు.

West Bengal: డ్రగ్స్ కొనడానికి రూ.10 అడిగిన యువకుడు.. బండరాయితో కొట్టి చంపిన స్నేహితుడు

గత నెలలో, నీరవ్ మోడీ తనను భారతదేశానికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బ్రిటన్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి అనుమతి కోసం బ్రిటన్ హైకోర్టులో ఒక దరఖాస్తును దాఖలు చేశారు. మానసిక ఆరోగ్య కారణాలపై అప్పగింతకు వ్యతిరేకంగా చేసిన అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. మనీ లాండరింగ్ కేసుతో పాటు మోసం ఆరోపణలను ఎదుర్కొంటున్న నీవర్‭ను భారతదేశానికి అప్పగించడం అన్యాయం కాదని అణచివేత కాదని, ఆత్మహత్య సదృశ్యం అంతకన్నా కాదని కోర్టు పేర్కొంది.

Raghuram Rajan: వృద్ధి రేటు అంతకు పెరిగితే దేశం అదృష్టం చేసుకున్నట్లేనట.. దేశ ఆర్థిక స్థితిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరమే నీరవ్ మోదీ భారతదేశం వదిలి పారిపోయారు. 13,000 కోట్ల పీఎన్‌బీ కుంభకోణంలో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు. 7,000 కోట్ల రూపాయల విలువైన పీఎన్‌బీని మోసం చేయడం, మనీలాండరింగ్, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, సాక్షులను బెదిరించడం వంటి ఆరోపణలు నీరవ్‭పై చాలా బలంగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం యుకెలో ఉంటున్న అతడిని అక్కడి నుంచి రప్పించడానికి ప్రయత్నిస్తున్నారు.

India-China Clash: లోక్‭సభలో వరుసగా మూడో రోజు వాయిదా నోటీసు ఇచ్చిన కాంగ్రెస్

పీఎన్‌బీ స్కామ్‌కు సంబంధించి నీరవ్ మోదీపై రెండు సెట్ల క్రిమినల్ ప్రొసీడింగ్‌ కేసులు నమోదై ఉన్నాయి. మోసం ద్వారా వచ్చిన సొమ్మును లాండరింగ్ చేయడంపై దర్యాప్తు చేస్తున్నప్పుడు లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌ఓయులు) లేదా రుణ ఒప్పందాలను మోసపూరితంగా పొందడం ద్వారా పీఎన్‌బీపై పెద్ద ఎత్తున మోసం జరిగిందని సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు