Aadhaar New Update : 10ఏళ్లుగా అప్‌డేట్ చేయని ఆధార్ కార్డులు జూన్ 14 తర్వాత పనిచేయవా? UIDAI క్లారిటీ ఇదిగో..!

Aadhaar New Update : ప్రభుత్వం ఉచిత ఆధార్ వివరాల అప్‌డేట్ కోసం గడువును మరోసారి పొడిగించింది. యూఐడీఏఐ సోషల్ మీడియా పోస్ట్‌లో ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సదుపాయం జూన్ 14, 2024 వరకు పొడిగించింది.

Aadhaar New Update : దశాబ్దం క్రితం జారీ చేసిన ఆధార్ కార్డులను అప్‌డేట్ చేయకపోతే వచ్చే జూన్ 14 తర్వాత చెల్లుబాటు కాదంటూ సోషల్ మీడియాలో ఓ ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఈ వాదనలను కొట్టిపారేసింది. ఈ వార్త అబద్ధమని స్పష్టం చేసింది. ఉచిత ఆధార్ అప్‌డేట్‌ల కోసం గడువు పొడిగింపునకు సంబంధించి ప్రభుత్వం చేసిన ప్రకటనపై తప్పుదారి పట్టించే నివేదికలు వచ్చినట్లు కనిపిస్తోంది.

ఆధార్ అప్‌డేట్, వ్యాలిడిటీపై యూఐడీఏఐ క్లారిటీ :
గత పదేళ్లుగా అప్‌డేట్ చేయకున్నా ఆధార్ కార్డులు చెల్లుబాటు అవుతాయని యూఐడీఏఐ ధృవీకరించింది. ఆధార్ వివరాల కోసం ఉచిత అప్‌డేట్ గడువు పొడిగింపుకు సంబంధించి గతంలో చేసిన ప్రకటన నుంచి అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. ప్రారంభంలో ఆధార్ గడువును మార్చి 14గా నిర్ణయించారు. కానీ, జూన్ 14, 2024 వరకు పొడిగించారు. ఈ పొడిగింపు జూన్ 14 తర్వాత ఆధార్ కార్డ్‌లు చెల్లుబాటు కానుందనే అపోహకు దారితీసింది.

Read Also : Blue Aadhaar Card : బాల (బ్లూ) ఆధార్ కార్డు అంటే ఏంటి? ఈ ప్రత్యేకమైన కార్డు ఐదేళ్ల లోపు పిల్లలకు ఎందుకు ముఖ్యమంటే?

కేంద్రం మరోసారి పొడిగింపుతో ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేయడానికి జూన్ 14, 2024 వరకు అనుమతిస్తుంది. అయితే, ఆధార్ సేవా కేంద్రంలో వ్యక్తిగతంగా తమ ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాల్సిన వారు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఆధార్ కార్డ్‌కి ఎవరైనా ఫోన్ నంబర్ యాడ్ చేయాల్సి వస్తే.. తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి. అప్‌డేట్ కోసం వర్తించే ఛార్జీలను చెల్లించాలి. గత దశాబ్దంలో ఆధార్ కార్డ్‌లు అప్‌డేట్ చేయకపోయినా గడువు తేదీ తర్వాత కూడా పనిచేస్తూనే ఉంటాయని యూఐడీఏఐ హామీ ఇచ్చింది.

ఫ్రీ ఆధార్ అప్‌డేట్ గడువు.. జూన్ 2024 వరకు పొడిగింపు :
ప్రభుత్వం ఉచిత ఆధార్ వివరాల అప్‌డేట్ కోసం గడువును మార్చి 14వ తేదీ నుంచి జూన్ 14, 2024 వరకు పొడిగించింది. యూఐడీఏఐ సోషల్ మీడియా పోస్ట్‌లో ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సదుపాయం జూన్ 14, 2024 వరకు పొడిగించింది. తద్వారా లక్షలాది మంది ఆధార్ హోల్డర్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. ఈ కాంప్లిమెంటరీ సర్వీస్ ప్రత్యేకంగా (myAadhaar) పోర్టల్‌లో అందుబాటులో ఉంది. యూఐడీఏఐ యూజర్లు తమ ఆధార్ డాక్యుమెంట్లను లేటెస్టుగా ఉంచుకోవాలని ప్రోత్సహిస్తుంది.

ఆధార్ కార్డ్ అప్‌డేట్‌కు అవసరమైన డాక్యుమెంట్లు :
ఆధార్ కార్డ్ సమాచారాన్ని అప్‌డేట్ చేసేందుకు మీరు (myAadhaar) పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు ఈ కిందివిధంగా ఉన్నాయి.

  • పాస్‌పోర్టు
  • డ్రైవింగ్ లైసెన్స్
  • పాన్ కార్డ్ ఓటరు ఐడీ,
  • నివాస ధృవీకరణ పత్రాలు,
  • లేబర్ కార్డ్‌లు
  • జన-ఆధార్ వంటి ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డులు
  • వివాహ ధ్రువీకరణ పత్రం
  • రేషన్ కార్డు

అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి :
3 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు (కొత్తవి) ఉండాలి. గత 3 నెలల్లో జారీ చేసిన విద్యుత్ లేదా గ్యాస్ కనెక్షన్ బిల్లులు పాస్‌పోర్టు, వివాహ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు గత సంవత్సరంలో జారీ చేసిన ఆస్తి పన్ను రసీదులు, నివాస ధృవీకరణ పత్రాలు, లేబర్ కార్డ్‌లు, జన-ఆధార్ వంటి ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డులు

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ అప్‌డేట్ :

  • యూఐడీఏఐ ఆటో సర్వీసు అప్‌డేట్ పోర్టల్‌ (https://ssup.uidai.gov.in/ssup/)ను విజిట్ చేయండి.
  • ‘లాగిన్’ బటన్‌పై క్లిక్ చేసి, కనిపించే క్యాప్చా కోడ్‌తో పాటు ప్రత్యేకమైన 12-అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • ఆ తర్వాత, మీ ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌లో వన్-టైమ్ పాస్‌వర్డ్‌ కోసం ‘Send OTP’పై క్లిక్ చేయండి.
  • అందుకున్న OTPని ఎంటర్ చేసి Continue ఆప్షన్ క్లిక్ చేయండి.
  • సర్వీసెస్ ట్యాబ్‌లో, ‘Update Aadhaar Online’ని ఎంచుకోండి.
  • ‘Proceed to Update Aadhaar’పై క్లిక్ చేసి, మీరు ఎడిట్ చేసే వివరాలను ఎంచుకోండి.
  • ఆధార్ కార్డ్‌లో మీ ప్రస్తుత పేరు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
  • కావలసిన మార్పులు చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
  • ఆధార్ ఎడిట్ వివరాలను కన్ఫార్మ్ చేయండి.
  • మీ ఆధార్ డేటా వారం రోజుల్లో అప్‌డేట్ అవుతుంది.

Read Also : Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.13వేలు డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే..!

ట్రెండింగ్ వార్తలు