కుళ్లిన కూరగాయలు, పురుగులు పట్టిన పదార్ధాలు.. హోటల్స్‌లో బయటపడుతున్న దారుణాలు

చాలారోజులుగా ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన వెజిటబుల్స్ ఉన్నాయి. కిచెన్ లోనూ అపరిశుభ్ర వాతావరణం ఉంది.

Raids In Hotels : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ జిల్లాలోని తాజా హాలిడే బ్రేక్ ఫాస్ట్ హోటల్ లో అధికారులు తనిఖీలు చేశారు. స్టోర్ రూమ్ లో ఫుడ్ కలర్స్ గుర్తించిన అధికారులు పూర్తి స్థాయిలో కుళ్లిపోయిన కూరగాయలను వాడుతున్నట్లు గుర్తించారు. లేబుల్ లేని టీ పౌడర్, పురుగులు పట్టి పాడైన కొర్రలను అధికారులు గుర్తించారు.

వట్టినాగుల పల్లిలోని ప్రిజం రెస్టారెంట్ లోనూ అధికారులు తనిఖీలు చేశారు. కాలం చెల్లిన ఫుడ్ ఐటెమ్స్ తో పాటు కుళ్లిన కూరగాయలు గుర్తించారు. చాలారోజులుగా ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన వెజిటబుల్స్ ఉన్నాయి. కిచెన్ లోనూ అపరిశుభ్ర వాతావరణం ఉంది.

నగరంలోని వివిధ ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా జరిపిన తనిఖీల్లోనూ కస్టమర్లను ఆందోళనకు గురి చేసే అంశాలు వెలుగుచూశాయి. ఫుడ్ సేఫ్టీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేవీ పాటించడం లేదని గుర్తించారు.

గ్రేటర్ పరిధిలోని అన్ని హోటల్స్ లోనూ ఇదే పరిస్థితి ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. కాలం చెల్లిన పదార్ధాలనే వాడుతున్నారు. ఇక హోటల్స్ లో ఫుడ్ సర్వ్ చేసే వాళ్లు, కిచెన్ లో పని చేసే వాళ్లు ఎవరూ కూడా మెడికల్ సర్టిఫికెట్స్ లేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో వారికి ఏవైనా అంటువ్యాధులు ఉంటే.. ఇతరులకు సోకే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. తాజాగా జరిపిన తనిఖీల్లో ఇదే అంశాన్ని అధికారులు గుర్తించారు.

వాడలేని పరిస్థితుల్లో ఉన్న కూరగాయలనే వంటకాల్లో వినియోగిస్తున్నారు. ఇక కిచెన్, వాష్ ఏరియాలో పరిశుభ్రత గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అంటున్నారు అధికారులు. కిచెన్, వాష్ ఏరియాలో అపరిశుభ్రత ఎక్కువగా ఉంది. వాటర్ బ్లాక్ అయ్యింది. తీవ్రమైన దుర్వాసన వస్తోంది. ప్రజలకు ఆహార విషయంలో కొంత సేఫ్టీ ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే దాడులు నిర్వహిస్తున్నారు. మేడ్చల్, రంగారెడ్డి మాత్రమే కాకుండా ఖమ్మంలోని పలు హోటల్స్ లో దాడులు నిర్వహించారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ ప్రథమ లక్ష్యంగా జీహెచ్ఎంసీ అధికారులతో పాటు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు.. హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని హోటల్స్ లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

Also Read : మిర్చి సెంచరీ, బీన్స్ డబుల్ సెంచరీ..! మండిపోతున్న కూరగాయల ధరలు, వణికిపోతున్న ప్రజలు

ట్రెండింగ్ వార్తలు