నా హత్యకు కుట్ర చేశారు, చెవిరెడ్డిని మించిన నటుడు దేశంలో లేరు- పులివర్తి నాని సంచలన ఆరోపణలు

50 కోట్ల రూపాయల ఫైన్ వేయించి నన్ను ఆర్థికంగా దెబ్బతీశారు. నీలా నేను ఎర్రచందనం వ్యాపారం చేయలేదు.

Pulivarthi Nani : చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సంచలన ఆరోపణలు చేశారు. తన హత్యకు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. దేశంలో చెవిరెడ్డిని మించిన మహా నటుడు లేరని సెటైర్లు వేశారు. యూనివర్సిటీలో తనపై జరిగిన దాడిపై మీడియాకు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు నాని. అలాగే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన కామెంట్స్ కు కౌంటర్ కూడా ఇచ్చారు.

”సమ్మెటతో కొట్టడం వల్ల నా తల, భుజంపై గాయాలయ్యాయి. దాడి నాపైనే జరిగింది. నన్ను చంపాలని చూశారు. నామినేషన్ రోజు వైసీపీ నేతలే రాళ్లు వేశారు. ఆ రోజు నా కోడలిపై దాడి చేయాలని చూశారు. నాకున్నది ఒక్క క్వారీ మాత్రమే. దానికి 50 కోట్ల రూపాయల ఫైన్ వేయించి నన్ను ఆర్థికంగా దెబ్బతీశారు.

Also Read : నాని డ్రామాలు ఆడారు, వాళ్లపై ఒక్క కేసు కూడా లేదు- దాడి ఘటనపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

చెవిరెడ్డి ఒక అపరిచితుడు. 2014 నుంచి చంద్రగిరిలో దొంగ ఓట్లతో రాజకీయం చేస్తున్నారు. నీలా నేను ఎర్రచందనం వ్యాపారం చేయలేదు. వ్యక్తిగతంగా నేను, మా కుటుంబం చెవిరెడ్డిని దూషించ లేదు. చెవిరెడ్డిని మించిన నటుడు దేశంలో లేరు. కరోనా సమయంలో పెద్దఎత్తున డబ్బులు వసూలు చేశారు.

నాపై చెవిరెడ్డి 28 కేసులు పెట్టించారు. మా నాయకులపై లెక్కలేనన్ని కేసులు పెట్టించారు. నాపై దాడి జరిగిన 45 నిమిషాల వరకు పోలీసులు రాలేదు. ఐదేళ్లు చేసిన అక్రమాల వల్ల ఇవాళ నువ్వు ఓడిపోతున్నావు. నాపై హత్యాయత్నం వెనుక నీ పాత్ర లేదని ఎక్కడైనా ప్రమాణం చేయగలవా? జగన్ భార్య భారతి తమ్ముడికి ఇక్కడ 18 ఎకరాల తీసిచ్చావు. నీ చిట్టా ఇంకా చాలా ఉంది. ఇక చెవిరెడ్డి మాటలు ఎవ్వరూ నమ్మరు” అని పులివర్తి నాని అన్నారు.

Also Read : ఆ 4 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీదే అధికారం..! ఏపీ ఎన్నికల్లో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

ట్రెండింగ్ వార్తలు