Realme Narzo N65 5G : అదిరే ఫీచర్లతో రియల్‌మి నార్జో N65 ఫోన్ వచ్చేసింది.. ఈ 5జీ ఫోన్ ధర ఎంతో తెలుసా?

Realme Narzo N65 5G : రియల్‌మి నార్జో N65 5జీ ఫస్ట్ సేల్ మే 31 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. రియల్‌మి కొనుగోలుదారులకు రూ. 1,000 కూపన్ తగ్గింపుతో పాటు హ్యాండ్‌సెట్ ప్రారంభ ధరను రూ. 10,499కు పొందవచ్చు.

Realme Narzo N65 5G : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. అదే.. రియల్‌మి నార్జో N65 5జీ.. కంపెనీ నార్జో సిరీస్‌లో సరికొత్త హ్యాండ్‌సెట్‌గా సోమవారం (మే 27) భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది.

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 ఎస్ఓసీపై రన్ అవుతుంది. డస్ట్, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ54 రేటింగ్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 120Hz రిఫ్రెష్ రేట్‌తో హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మినీ క్యాప్సూల్ 2.0 ఫీచర్‌ను అందిస్తుంది. రియల్‌మి నార్జో N65 5జీ డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. 15డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.13వేలు డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే..!

భారత్‌లో రియల్‌మి నార్జో N65 5జీ ధర :
రియల్‌మి నార్జో N65 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 11,499, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499కు పొందవచ్చు. అంబర్ గోల్డ్, డీప్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. అమెజాన్, రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ ద్వారా విక్రయానికి వస్తుంది. రియల్‌మి నార్జో N65 5జీ ఫస్ట్ సేల్ మే 31 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. రియల్‌మి కొనుగోలుదారులకు రూ. 1,000 కూపన్ తగ్గింపుతో పాటు హ్యాండ్‌సెట్ ప్రారంభ ధరను రూ. 10,499కు పొందవచ్చు.

రియల్‌మి నార్జో N65 5జీ స్పెసిఫికేషన్లు :
రియల్‌మి నార్జో N65 5జీ ఫోన్ డ్యూయల్-సిమ్ (నానో) ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రియల్‌మి యూఐ 5.0 స్కిన్‌పై రన్ అవుతుంది. 6.67-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్వరకు రిఫ్రెష్ రేట్, 89.97 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఉంటుంది. సెల్ఫీ షూటర్‌ కోసం డిస్‌ప్లే మధ్యలో హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ 6ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ ఎస్ఓసీ ద్వారా గరిష్టంగా 6జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఈ కొత్త మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌తో అమర్చిన భారత్‌లో మొదటి స్మార్ట్‌ఫోన్ అని పేర్కొన్నారు. టీయూవీ ఎస్‌యూవీ 48-నెలల ఫ్లూన్సీ సర్టిఫికెట్‌తో వస్తుంది. డైనమిక్ ర్యామ్ ఫీచర్‌తో ఆన్‌బోర్డ్ మెమరీని 12జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. :
రియల్‌మి నార్జో ఎన్65 5జీ ఫోన్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్‌‌లో 8ఎంపీ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. దీనిని 2టీబీ వరకు విస్తరించవచ్చు. మినీ క్యాప్సూల్ 2.0 ఫీచర్‌ను కలిగి ఉంటుంది. హోల్-పంచ్ కటౌట్ చుట్టూ ఛార్జింగ్ స్టేటస్, ఇతర ముఖ్యమైన హెచ్చరికలను ప్రదర్శిస్తుంది. రియల్‌మి నార్జో N65 5జీలోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, వై-ఫై, బ్లూటూత్ ఉన్నాయి. ఈ ఫోన్ డస్ట్, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ54 రేటింగ్‌ను కలిగి ఉంది.

తడి చేతులతో సజావుగా పనిచేసేందుకు రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను అందిస్తుంది. రియల్‌మి 15డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో రియల్‌మి నార్జో N65 5జీలో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఈ క్విక్‌ఛార్జ్ ఫీచర్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. బ్యాటరీ గరిష్టంగా 39.4 గంటల కాలింగ్ టైమ్, 28 రోజుల వరకు స్టాండ్‌బై సమయాన్ని అందించగలదు. ఈ హ్యాండ్‌సెట్ 190 గ్రాములు, 7.89ఎమ్ఎమ్ మందం ఉంటుంది.

Read Also : Aadhaar New Update : 10ఏళ్లుగా అప్‌డేట్ చేయని ఆధార్ కార్డులు జూన్ 14 తర్వాత పనిచేయవా? UIDAI క్లారిటీ ఇదిగో..!

ట్రెండింగ్ వార్తలు