Russia ukraine war : యుక్రెయిన్ పై యుద్ధంలో టార్గెట్స్ మిస్ అవుతున్న రష్యా..60 శాతం మిస్సైల్స్ విఫ‌లం

యుక్రెయిన్ పై యుద్ధంలో రష్యా టార్గెట్స్ మిస్ అవుతోందని..మిస్సైల్స్ తుస్సు మంటున్నాయని రష్యాకు చెందిన 60 శాతం మిస్సైల్స్ విఫ‌లం అవుతున్నాయని అమెరికా వెల్లడించింది.

Russia ukraine war : యుక్రెయిన్ పై రష్యా 30 రోజులనుంచి యుద్ధం చేస్తోంది. కానీ ఇప్పటి వరకు యుక్రెయిన్ పై పట్టు సాధించలేకపోతోంది. పలు నగరాలను ధ్వంసం చేసినా రష్యాకు యుక్రెయిన్ మాత్రం చిక్కటంలేదు. దీంతో రష్యా మరింత ఉదృతంగా దాడులు చేస్తున్నా రష్యా అనుకున్న టార్గెట్స్ ను సాధించలేకపోతోంది. ఈ విషయాన్ని అమెరికా స్వయంగా వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్ పై యుద్ధం చేసే క్రమంలో టార్గెట్స్ మిస్ అవుతున్నాయని రష్యా మిస్సైల్స్ టార్గెట్స్ రీచ్ కావటంలో ఫెయిల్ అవుతున్నాయని అమెరికా రిపోర్టులో వెల్లడించింది. యుక్రెయిన్ పై యుద్ధంలో రష్యా అట్టర్ ప్లాప్ అయ్యిందని అమెరికా ఎద్దేవా చేస్తోంది. రష్యా గురి తప్పిందంటూ సెటైర్లు వేస్తోంది అమెరికా.

Also read : Russia ukraine war :పుతిన్‌ VS జెలెన్‌స్కీ..ధరించే డ్రెస్సులతోనే ప్రపంచానికి సందేశం..టీ షర్టుల వెనుక ఉన్న అసలు విషయం..

యుక్రెయిన్ పై రష్యా 60 శాతం ఫెయిల్ అవుతోందని చెబుతోంది అమెరికా. యుక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లిన ర‌ష్యాకు చేదు అనుభ‌వాలే ఎదుర‌వుతున్నాయి. రష్యా యుక్రెయిన్ పై ప్ర‌యోగించిన క్షిప‌ణ‌లు అత్య‌ధిక సంఖ్య‌లో విఫ‌లం అవుతున్న‌ాయని అమెరికా వెల్లడించింది. రష్యా యుక్రెయిన్ పై చేసిన యుద్దం పై అమెరికా అధికారులు ఓ రిపోర్ట్ త‌యారు చేశారు. దాదాపు 60 శాతం ర‌ష్యా ప్ర‌యోగించిన క్షిప‌ణులు విఫ‌లం అవుతున్న‌ట్లు ఓ నివేదిక ద్వారా వెల్ల‌డైంది. స‌రైన రీతిలో లాంచ్ చేసే సామ‌ర్థ్యం లేక‌పోవ‌డ‌మో లేక పేలే స‌మ‌యంలో ఆ క్షిప‌ణ‌లు పేల‌క‌పోవ‌డం జ‌రుగుతుంద‌ని అనుమానిస్తున్నారు.

Also read :  Phosphorus Bombs : యుక్రెయిన్‌పై ఫాస్పరస్‌ బాంబులతో దాడి..? స్పందించిన రష్యా
60 శాతం ర‌ష్యా మిస్సైళ్లు విఫ‌లం అవుతున్న‌ట్లు అమెరికా చెప్పినా.. దీనిపై క్లారిటీ లేదు. కానీ నెల రోజుల ఆక్ర‌మ‌ణ వ‌ల్ల ర‌ష్యా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ష్యా సుమారు 1100 మిస్సైళ్లు ప్ర‌యోగించిన‌ట్లు అమెరికా త‌న నివేదిక‌లో చెప్పింది. దీంతో ఎన్ని టార్గెట్‌ను చేరుకున్నాయి. ఎన్ని విఫ‌లం అయ్యాయో తెలియ‌డం లేదు. కానీ యుక్రెయిన్ పై యుద్దం అంతా తాను ప్లాన్ చేసినట్లుగానే జరుగుతోంది అని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పుకొస్తున్నారు. మరి పుతిన్ కావాలని యుక్రెయిన్ ను స్వాధీనం చేసుకోలేకపోతోందా? లేదా తమ మిస్సైల్స్ గురి తప్పుతున్నాయి కాబట్టి ప్రపంచ దేశాల ముందు పరువు పోకుండా పుతిన్ అబద్ధాలు ఆడుతున్నారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.

Also read : Russia Ukraine: యుక్రెయిన్ పై మొదటి దశ యుద్ధం పూర్తయిందన్న రష్యా: ఆ తరువాత ఏంటి?

 

ట్రెండింగ్ వార్తలు