Spelling Mistake : చిన్న అక్షర దోషానికి రెండున్నరేళ్ల జైలు శిక్ష

కొన్ని దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. చిన్న తప్పులు చేసినా కఠిన శిక్ష విధిస్తుంటారు. చిన్న తప్పుకు కూడా కఠిన శిక్షలు వేసే సంఘటనలు, అరబిక్, ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తుంటాయి.

Spelling Mistake :  కొన్ని దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. చిన్న తప్పులు చేసినా కఠిన శిక్ష విధిస్తుంటారు. చిన్న తప్పుకు కూడా కఠిన శిక్షలు వేసే సంఘటనలు, అరబిక్, ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తుంటాయి. చేసిన తప్పు చిన్నదైనా వేసిన శిక్ష మాత్రం జీవితాంతం ప్రభావం చూపేలా ఉంటుంది.. అయితే టర్కీలో ఓ రాజకీయ నాయకుడి భార్యకు వేసిన శిక్ష.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆమె తప్పు ఏం లేకపోయినా.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆమెకు ఏకంగా రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.

చదవండి : Turkish : మాయలో పడకుండా..పెద్ద ఐస్ క్రీంతో పారిపోయాడు, వీడియో వైరల్

వివరాల్లోకి వెళితే.. టర్కీకి చెందిన టీచర్‌, రాజకీయ నాయకుడి భార్య బసక్ డెమిర్టాస్ అనే మహిళ 2015లో తీవ్రమైన అస్వస్థతకు గురయ్యింది. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉంది.. అనారోగ్యం కారణంగా గర్భం కోల్పోయింది. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఐదు రోజులు రెస్టు తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే అనారోగ్యంతో ఆమె డిసెంబర్ 11న ఆసుపత్రిలో చేరింది.. ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఆమె 14తేదీ చేరినట్లుగా తప్పుగా టైప్ చేశారు.

చదవండి : Life Sentence For Gang Rape : సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురికి జీవిత ఖైదు

డిశ్చార్జ్ సమరీ సరిగా చూసుకొని టీచర్ ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన డేట్‌తో లీవ్ అప్లై చేసి.. డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్‌ను అందులో సడ్మిట్ చేసింది. అయితే దానిని క్షున్నంగా పరిశీలించిన అధికారులు.. లీవ్ తేదీలు ఒకలా ఉండటం.. డిశ్చార్జ్ సమరీలో మరోలా ఉండటంతో డెమిర్టాస్‌ తప్పుడు రిపోర్ట్ సడ్మిట్ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంతచెప్పినా వినకుండా ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.

చదవండి : Father Sentenced : కూతురిపై లైంగిక దాడి చేసిన తండ్రికి 60 ఏళ్లు జైలుశిక్ష

తప్పుడు రిపోర్ట్ సమర్పించారని వైద్యుడికి, టీచర్‌కి 2018 రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఇక ఇదే అంశంపై బసక్ డెమిర్టాస్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. కోర్టు ఇన్వెస్టింగేషన్ కు ఆదేశించకుండానే శిక్ష విధించిందని. ఆసుపత్రి చేసిన తప్పిదానికి రెండున్నరేళ్లు శిక్ష పడిందని.. ఇది రాజకీయ కుట్రలో ఒకభాగమని ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు