Father Sentenced : కూతురిపై లైంగిక దాడి చేసిన తండ్రికి 60 ఏళ్లు జైలుశిక్ష

Father Sentenced : తమిళనాడులో ఓకసాయి తండ్రి స్నేహితులతో కలిసి కన్నకూతురిపై లైంగిక దాడి చేశాడు. 2019లో జరిగిన ఈఘటనలో నేరం రుజువవటంతో ప్రధాన నిందితుడైన తండ్రికి 60 ఏళ్లు, అతని ఇద్దరు స్నేహితులకు 40 ఏళ్లు చొప్పన న్యాయస్ధానం జైలు శిక్ష విధించింది.

ఈరోడ్ జిల్లా గోబిసమీప గ్రామానికిచెందిన బాలిక(10)తండ్రి,తమ్ముడితో కలిసి జవిస్తోంది. తండ్రిపెట్టే హింసలు భరించలేక బాలిక తల్లి పిల్లల్ని వదిలేసి ఎటో వెళ్లిపోయింది. 2019లో బాలిక తండ్రి, తన స్నేహితులైన అరుణాచలం(35), మణికంఠన్(33), లతో కలిసి బాలికపై సమూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు.

ఈ విషయంపై స్ధానికులు గోబి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసుకున్నపోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. కేసువిచారణ జరిపిన ఈరోడ్ జిల్లా మహిళా కోర్టు న్యాయమూర్తి మాలతి బుధవారం తీర్పు చెప్పారు. బాలిక తండ్రికి మూడుసెక్షన్ల కింద 20 ఏళ్ల చొప్పున 60 ఏళ్లు జైలుశిక్ష, మిగిలిన ఇద్దరికీ రెండుసెక్షన్లకింద చెరో 40 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు