Vithika Sheru : మా ఆయన ఫెయిల్యూర్ హీరో కాదు.. స్టేజిపై ఎమోషనల్ అయిన వరుణ్ సందేశ్ భార్య..

వరుణ్ సందేశ్ కెరీర్ లో ఎక్కువ ఫ్లాప్ సినిమాలే చూసాడు, మధ్యలో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. నింద ప్రమోషన్స్ లో వరుణ్ కి దీనిపైనే ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. వితిక షేరు దీనిపై స్పందించింది.

Vithika Sheru : హ్యాపీడేస్, కొత్తబంగారు లోకం, కుర్రాడు.. ఇలా ఒకప్పుడు వరుస హిట్స్ కొట్టిన వరుణ్ సందేశ్ ఆ తర్వాత పరాజయాలు, సినిమాలకు కొంచెం గ్యాప్, బిగ్ బాస్.. ఇవన్నిటి తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో ‘నింద’ అనే థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు వరుణ్ సందేశ్. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ జగన్నాథం నిర్మాతగా, దర్శకుడిగా ఈ నింద సినిమా తెరకెక్కిస్తున్నారు.

నింద సినిమా జూన్ 21న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నిఖిల్ గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్ కి వరుణ్ సందేశ్ భార్య, నటి వితిక షేరు కూడా వచ్చింది. అయితే వరుణ్ సందేశ్ కెరీర్ లో ఎక్కువ ఫ్లాప్ సినిమాలే చూసాడు, మధ్యలో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఇటీవల నింద ప్రమోషన్స్ లో వరుణ్ కి దీనిపైనే ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నింద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వితిక షేరు దీనిపై స్పందించింది.

Also Read : Anjali : వామ్మో.. పుట్టిన రోజున మాస్ లుక్స్ తో భయపెడుతున్న అంజలి..

వితిక షేరు మాట్లాడుతూ.. చాలా మంది ఇలా వరుణ్ ని ఫెయిల్యూర్ హీరో అంటున్నారు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 17 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంటూ సినిమాలు తీస్తూ ఉన్నాడు. ఇక్కడ ఫెయిల్ అయితే నాకు వద్దు అని అన్ని సర్దేసుకొని వెళ్లిపోయేవాళ్లే ఫెయిల్ అయినట్టు. ఫ్లాప్స్ రాగానే సినిమాలు వదిలేసి వెళ్లిపోయేవాళ్లు ఫెయిల్ యాక్టర్స్. మా ఆయన అలా వెళ్లిపోలేదు, మా ఆయన ఫెయిల్యూర్ యాక్టర్ కాదు అని చెప్తూ స్టేజిపై ఎమోషనల్ అయింది. దీంతో తన భర్తకి ఎంత బాగా సపోర్ట్ చేస్తుందో అని వితికపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు