అయ్యయ్యో పాక్.. చివరి మ్యాచ్‌లోనూ అతి కష్టంమీద గెలుపు

టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా లీగ్ దశలో తన చివరి మ్యాచ్ ను పాకిస్థాన్ గెలుచుకుంది.

T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా లీగ్ దశలో తన చివరి మ్యాచ్ ను పాకిస్థాన్ గెలుచుకుంది. ఐర్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి మ్యాచ్ జరిగింది. ఇప్పటికే టోర్నీనుంచి నిష్క్రమణకు గురైన పాకిస్థాన్ జట్టు.. లీగ్ లో తన చివరి మ్యాచ్ లోనూ ఐర్లాండ్ పై అతికష్టమీద విజయం సాధించింది. ఐర్లాండ్ నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో పాకిస్థాన్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో 11 ఓవర్లకే ఆరు వికెట్లు కోల్పోయి 62 పరుగులు మాత్రమే పాకిస్థాన్ చేయగిలింది. పాకిస్థాన్ జట్టుకు మరో ఓటమి ఖాయమని అందరూ భావించారు.

Also Read : స్కాట్లాండ్ పై ఆస్ట్రేలియా విజయం.. సూపర్-8కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్

చివర్లో పాకిస్థాన్ పుంజుకుంది. అబ్బాస్ అఫ్రీదితో కలిసి బాబర్ అజామ్ ఏడో వికెట్ కు 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో అతికష్టం మీద 18.5 ఓవర్లలో పాకిస్థాన్ ఐర్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. షాహీన్ అఫ్రిది కేవలం ఐదు బంతుల్లోనే రెండు సిక్సర్ల సాయంతో అజేయంగా 13 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.

Also Read : Shoaib Akhtar : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాకిస్తాన్ ఔట్‌.. షోయ‌బ్ అక్త‌ర్ సింగిల్ లైన్ పోస్ట్ వైర‌ల్‌..

గ్రూప్ -ఎ లో ఉన్న పాకిస్థాన్ నాలుగు మ్యాచ్ లు ఆడి కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. దీంతో కేవలం నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. గ్రూప్ -ఎ నుంచి ఇండియా, యూఎస్ఏ జట్లు సూపర్ -8కు అర్హత సాధించాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు