Bangladesh: దొంగతనం అయితే చేశాడు కానీ.. ఎలా తప్పించుకోవాలో తెలీక పోలీసులకు ఫోన్ చేసి సాయం కోరిన దొంగ

దుకాణం వద్దకు రాగానే పోలీసులతో పాటు జనం గుమిగూడి ఉండటం కనిపించిందని, పోలీసులు తనను షాపులోకి వెళ్లనీయలేదని జంటూ మియా చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఒక వ్యక్తితో కలిసి షాపు బయటకు రావడంతో తనకు అసలు విషయం అర్ధమైందని అన్నాడు. కాగా, పట్టుబడిన వ్యక్తి దొంగతనాల్లో ఆరితేరిన వాడని, చోరీకి ప్రయత్నించాడనే కారణంగా అతన్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు

Bangladesh: దొంగతనం చేసి పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవడం కామన్.. కొన్ని సందర్భాల్లో దొంగతనం చేసి పోలీసులకు తెలియకుండా వారి సాయంతోనే తప్పించుకోవడం అరుదు.. కానీ తాజాగా బంగ్లాదేశ్‭లో జరిగిన ఒక ఘటన వీటికి పూర్తి భిన్నం. ఎందుకంటే, ఒక వ్యక్తి దొంగతనం చేసిన అనంతరం.. తనను అక్కడి నుంచి తప్పించాలంటూ పోలీసులకు ఫోన్ చేయడం గమనార్హం. పోలీసులు వచ్చి అతడిని సేఫ్ గా బయటికి రప్పించడం మరొక విశేషం.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న బరిషల్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లభై ఏళ్ల వయసున్న ఓ దొంగ గత గురువారం రాత్రి బందర్ ఏరియాలోని ఏఆర్ మార్కెట్‌లోకి ప్రవేశించాడు. ఒక కిరాణా దుకాణానికి కన్నం వేసి లోపలకు చొరబడ్డాడు. అయితే కొద్ది సేపటికే వెలుతురు రావడం, జనం అక్కడికి చేరుకోవడం అతను కనిపెట్టాడు. స్టోర్‌లో బందీ అయిపోయిన విషయం గమినించాడు. అంతే..అతని వెన్నులో చలి మొదలైంది. జనం మూకుమ్మడిగా తన మీద పడి కొట్టిచంపేస్తేనో? ఆ ఆలోచన రాగానే నేషనల్ హెల్ప్‌లైన్ 999కు ఫోన్ చేసి పోలీసుల సాయం అర్థించాడు. సురక్షితంగా తనను బయటకు తీసుకురావాలని వేడుకున్నాడు.

Bharat Jodo Yatra In AP: ఏపీలో ముగిసిన భారత్ జోడో యాత్ర.. మద్దతుగా నిలిచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన రాహుల్

విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. దుకాణం లోపలికి వెళ్లి దొంగను పట్టుకుని బయటకు తెచ్చారు. దీనిపై బందర్ పోలీస్ స్టేషన్ చీఫ్ అసదుజ్ జమాన్ మాట్లాడుతూ, నేరం చేసిన వ్యక్తి పోలీసులకు ఫోన్ చేయడం అనేది తన పదేళ్ల చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పారు.మరోవైపు, పోలీసులు అక్కడకు చేరుకున్న కొద్దిసేపటికే షాపు తెరిచేందుకు వచ్చిన దుకాణం యజమాని జంటూ మియా అక్కడ ఏం జరుగుతోందో తెలియక కాసేపు తికమక పడ్డాడు.

దుకాణం వద్దకు రాగానే పోలీసులతో పాటు జనం గుమిగూడి ఉండటం కనిపించిందని, పోలీసులు తనను షాపులోకి వెళ్లనీయలేదని జంటూ మియా చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఒక వ్యక్తితో కలిసి షాపు బయటకు రావడంతో తనకు అసలు విషయం అర్ధమైందని అన్నాడు. కాగా, పట్టుబడిన వ్యక్తి దొంగతనాల్లో ఆరితేరిన వాడని, చోరీకి ప్రయత్నించాడనే కారణంగా అతన్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మొత్తానికి…పోలీసులకు పట్టుబడినా…జనంతో చావుదెబ్బలు తప్పాయనుకుంటూ దొంగ తేలిగ్గా ఊపిరిపీల్చుకున్నాడు.

Ghaziabad: ఢిల్లీ మహిళ గ్యాంగ్ రేప్ కేసులో భారీ ట్విస్ట్.. అదంతా నాటకమట

ట్రెండింగ్ వార్తలు