Adah Sharma : బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఫామ్‌లో ఉన్న అదాశర్మ.. ‘C.D(క్రిమినల్ ఆర్ డెవిల్)’ రేపే రిలీజ్..

తెలుగులో అదా శర్మ ‘C.D(క్రిమినల్ ఆర్ డెవిల్)’ అనే సినిమాతో రాబోతుంది.

Adah Sharma : ఇటీవల కేరళ స్టోరీ, బస్తర్.. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన అదా శర్మ(Adah Sharma) ప్రస్తుతం అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో ఇప్పుడు అదా శర్మ ‘C.D(క్రిమినల్ ఆర్ డెవిల్)’ అనే సినిమాతో రాబోతుంది. SSCM ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కృష్ణ అన్నం దర్శకత్వంలో అదా శర్మ మెయిన్ లీడ్ లో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, మహేష్ విట్టా.. పలువురు ముఖ్య పాత్రలతో ఈ ‘C.D(క్రిమినల్ ఆర్ డెవిల్)’ సినిమా తెరకెక్కింది.

Also Read : Punarnavi : పునర్నవి బాయ్ ఫ్రెండ్ అతనేనా? ఆ పోస్ట్ అర్ధం ఏంటో..

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు. హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా అందబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకి సెన్సార్ పూర్తవడంతో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సెన్సార్ సభ్యులు ఈ ‘C.D(క్రిమినల్ ఆర్ డెవిల్)’ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. ఇక ఈ సినిమాని రేపు మే 24న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అదా శర్మ ఈ సినిమాతో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు