Pawan Kalyan : 16 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్న బెస్ట్ ఫ్రెండ్.. ఉస్తాద్ లో భారీ సెట్..
ఇప్పుడు మళ్ళీ 16 ఏళ్ళ తర్వాత ఆనంద్ సాయి తన ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ సినిమాకి పనిచేసారు. (Pawan Kalyan)
Pawan Kalyan
Pawan Kalyan : ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, ఆలయాల స్థపతి ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ అని తెలిసిందే. ఆర్ట్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసిన ఆనంద్ సాయి ఆ తర్వాతి కాలంలో స్థపతిగా మారి ఆలయ నిర్మాణాల్లో భాగం అయ్యారు. యాదాద్రి టెంపుల్ కూడా ఆయనే చీఫ్ ఆర్కిటెక్ట్ గా దగ్గరుండి కట్టించారు. 2013 లో నాయక్ సినిమా తర్వాత ఆనంద్ సాయి సినిమాలు వదిలేసి ఆలయాల నిర్మాణంలో స్థపతిగా చేస్తున్నారు. ఆనంద్ సాయి, పవన్ కళ్యాణ్ దాదాపు 30 ఏళ్లుగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్.
ఇటీవలే కూటమి ప్రభుత్వంలో టీటీడీ బోర్డు మెంబర్ కూడా అయ్యారు ఆనంద్ సాయి. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక రెగ్యులర్ గా పవన్ తో కనిపిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కోసం ఆనంద్ సాయి మళ్ళీ ఆర్ట్ డైరెక్టర్ గా మారాడు. గతంలో పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, తమ్ముడు, జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం, జల్సా, చివరగా 2010 లో కొమరం పులి సినిమాలకు ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసారు. ఇప్పుడు మళ్ళీ 16 ఏళ్ళ తర్వాత ఆనంద్ సాయి తన ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ సినిమాకి పనిచేసారు.
Also See : Shanmukh Jaswanth : షణ్ముఖ్ జస్వంత్ నిశ్చితార్థం.. సందడి చేసిన యూట్యూబర్లు, సెలబ్రిటీలు.. ఫోటోలు..
ఈ విషయాన్ని హరీష్ శంకర్ తెలిపారు. ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 26 విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఆనంద్ సాయి గారైతే బాగుంటుందని పవన్ గారిని నేనే అడిగాను. ఆయన్ని అడుగు చేస్తానంటే నాకేం ప్రాబ్లమ్ లేదు అన్నారు. ఆనంద్ గారిని అడిగితే చాన్నాళ్లయింది పవన్ సినిమా చేసి చేస్తాను అన్నారు. ఈ సినిమాలో ఒక సాంగ్ కి సెట్ వేశారు ఆనంద్ సాయి . మైత్రి మూవీస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సెట్. అసలు ఆనంద్ గారు ఎంత పెద్ద ఆర్ట్ డైరెక్టర్. అయన మన తెలుగు సినిమాలో ఉండటం గర్వకారణం అని అన్నారు.
