టీమిండియా హెడ్ కోచ్ పదవిని రికీ పాంటింగ్ ఎందుకు తిరస్కరించాడు.. క్లారిటీ ఇచ్చిన పాంటింగ్

టీమిండియా హెడ్ కోచ్ పదవికోసం బీసీసీఐ తనను సంప్రదించిందని, కానీ.. నేను అందుకు నిరాకరించినట్లు రికీ పాంటింగ్ చెప్పాడు.

Teamindia Head Coach : టీ20 వరల్డ్ కప్ 2024 తరువాత రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలగనున్నాడు. ఈ క్రమంలో బీసీసీఐ కొత్త కోచ్ కోసం అన్వేషిస్తుంది. ఇప్పటికే టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని, అందుకు చివరి తేదీనికూడా బీసీసీఐ ప్రకటించింది. ఈ రేసులో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో ప్రముఖంగా ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాటింగ్, టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ తోపాటు పలువురు మాజీ క్రికెటర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ఆ జాబితా నుంచి రికీ పాంటింగ్ పక్కకు తప్పుకున్నట్లయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు.

Also Read : IPL 2024 : ఈసారి కూడా పాయె..! ఆర్సీబీ ఓటమిపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్.. వీడియోలు వైరల్

టీమిండియా హెడ్ కోచ్ పదవికోసం బీసీసీఐ తనను సంప్రదించిందని, కానీ.. నేను అందుకు నిరాకరించినట్లు రికీ పాంటింగ్ చెప్పాడు. భారత జట్టుకు ప్రధాన కోచ్ కావడానికి ఆసక్తిని కలిగి ఉన్నానని, కానీ, సొంతకారణాల వల్ల బీసీసీఐ ప్రతిపాదనను తిరస్కరించాల్సి వచ్చిందని పాంటింగ్ తెలిపాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవి అంటే ఏడాదికి దాదాపు 10 నుంచి 11నెలలు పనిచేయాల్సి ఉంటుంది. ఎప్పుడూ బిజీ షెడ్యూల్ కారణంగా కుటుంబానికి సమయం ఇచ్చే అవకాశం ఉండదు. అందుకే టీమిండియా హెడ్ కోచ్ పదవిపై అనాసక్తిని చూపినట్లు పాంటింగ్ చెప్పారు.

Also Read : Dinesh Karthik : ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేశ్ కార్తీక్..! కోహ్లీ ఏం చేశాడంటే..? వీడియో వైరల్

ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కోచ్ గా రికీ పాంటింగ్ కొనసాగుతున్నాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవిని స్వీకరిస్తే ఐపీఎల్ లో ఏ జట్టుకూ కోచ్ గా ఉండలేరు. బీసీసీఐ ప్రతిపాదనను పాంటింగ్ తిరస్కరించడానికి అదికూడా ఓ కారణంగా తెలుస్తోంది.

Also Read : IPL 2024 : ఆర్సీబీ ఓటమితో ఆనందంలో సీఎస్కే, ముంబై ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో సెటైర్లు..

ట్రెండింగ్ వార్తలు