Gosangi Subbarao : తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న భోజ్‌పురి స్టార్ డైరెక్టర్..

చాలా విరామం తర్వాత డైరెక్టర్ గోసంగి సుబ్బారావు తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

Gosangi Subbarao : నాలుగు దశాబ్దాల క్రితం సినీ పరిశ్రమలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి అనంతరం దర్శకుడిగా ఎదిగారు గోసంగి సుబ్బారావు. తెలుగులో తన మొదటి సినిమా భవానితో మంచి హిట్ కొట్టి ఆ తర్వాత శివుడు, మనమిద్దరం.. లాంటి పలు సినిమాలు తీసి గోసంగి సుబ్బారావు ఆ తర్వాత అనుకోకుండా భోజ్‌పురి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ వరుసగా 15 సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. భోజ్‌పురి సినీ పరిశ్రమలో మంచి కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు గోసంగి సుబ్బారావు అనిపించుకున్నారు.

గోసంగి సుబ్బారావుతో భోజ్‌పురిలో దివంగత నిర్మాత రామానాయుడు, స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ సోదరుడు సాయిబాబా కూడా సినిమాలు నిర్మించారు. ఇప్పుడు చాలా విరామం తర్వాత డైరెక్టర్ గోసంగి సుబ్బారావు తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

Also Read : Punarnavi : పునర్నవి బాయ్ ఫ్రెండ్ అతనేనా? ఆ పోస్ట్ అర్ధం ఏంటో..

గోసంగి సుబ్బారావు తెలుగులో ‘బిగ్ బ్రదర్’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈనెల 24న ఈ బిగ్ బ్రదర్ సినిమా రిలీజ్ కాబోతుంది. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్ పై శంకర్ రావు కంఠంనేని, ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించగా శివ కంఠంనేని, ప్రియా హెగ్డే జంటగా నటించారు. ఈ సినిమా రిలీజ్, తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా గోసంగి సుబ్బారావు మీడియాతో మాట్లాడారు.

గోసంగి సుబ్బారావు మాట్లాడుతూ.. అనుకోకుండా భోజ్‌పురి ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాను. ఒకరకంగా భోజ్‌పురి పరిశ్రమ నన్ను దత్తత తీసుకుంది. తెలుగులో రీఎంట్రీ కోసం చాలా రోజులుగా ట్రై చేస్తుంటే ఇప్పటికి కుదిరింది. నా స్నేహితుడు ఘంటా శ్రీనివాసరావు ఒత్తిడి వల్ల ‘బిగ్ బ్రదర్’ సినిమాతో డైరెక్టర్ గా మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇకపై తెలుగులోనే ఎక్కువ సినిమాలు తీస్తాను అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు