Punarnavi : పునర్నవి బాయ్ ఫ్రెండ్ అతనేనా? ఆ పోస్ట్ అర్ధం ఏంటో..

తాజాగా పునర్నవి తన సోషల్ మీడియాలో ఒక అబ్బాయితో దిగిన ఫోటో పోస్ట్ చేసి..

Punarnavi : ఉయ్యాలా జంపాల సినిమాలో హీరోయిన్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ తో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన పునర్నవి భూపాలం ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్స్ తో మెప్పించి 2019లో బిగ్ బాస్ లో పాల్గొని పాపులారిటీ తెచ్చుకుంది. ఆ షో తర్వాత తనకి పలు అవకాశాలు వచ్చినా ఓ సిరీస్ లో నటించి, పలు టీవీ షోలలో కనిపించి అనంతరం చదువుకోడానికి లండన్ వెళ్ళింది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది పునర్నవి.

గతంలో పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ తో రిలేషన్ లో ఉందని వార్తలు వచ్చినా అవి కొట్టిపారేశారు ఇద్దరూ. తాజాగా పునర్నవి తన సోషల్ మీడియాలో ఒక అబ్బాయితో దిగిన ఫోటో పోస్ట్ చేసి స్పెషల్ గా బర్త్ డే విషెష్ చెప్పింది. అమెరికాలో హవాసుపై ఇండియన్ రిజర్వేషన్ అనే విజిటింగ్ ప్లేస్ వద్ద కొండల్లో ఓ అబ్బాయితో దిగిన ఫోటోని పునర్నవి షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలో వాళ్ళు వెనక్కి తిరిగి కూర్చున్న ఫోటోని పోస్ట్ చేయడంతో ముఖాలు కనిపించట్లేదు. ఆ అబ్బాయి పునర్నవిని దగ్గరికి హత్తుకొని కూర్చోగా.. పునర్నవి ఆ అబ్బాయిపై చెయ్యి వేసుకొని కూర్చుంది.

Also Read : Ilaiyaraaja : ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా టీంకు కూడా లీగల్ నోటీసులు పంపిన ఇళయరాజా.. ఇంకెంతమందికి పంపుతారో..

పునర్నవి ఈ ఫోటో షేర్ చేసి.. నా ఒక్కగానొక్క లవ్ కి హ్యాపీ బర్త్ డే అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో అతను పునర్నవి బాయ్ ఫ్రెండ్ అని అందరూ అనుకుంటున్నారు. హ్యాపీ బర్త్ డే లవ్ అని రాయడంతో పాటు చాలా క్లోజ్ గా దిగిన ఫోటో షేర్ చేయడంతో పునర్నవి బాయ్ ఫ్రెండ్ ఇతనే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఆ ఫొటోలో ఉన్నది ఎవరో, అసలు అతను పునర్నవి బాయ్ ఫ్రెండేనా, లేదా కేవలం ఫ్రెండా తెలియాలి.

 

ట్రెండింగ్ వార్తలు