Gold Rate : భారీగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు వివరాలు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో గురువారం బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో.. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో

Gold and Silver Rate Today : గ్లోబల్ మార్కెట్లో ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలకు బిగ్ బ్రేక్ పడింది. వరుసగా మూడోరోజు గోల్డ్ ధర తగ్గింది. మూడు రోజుల్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ. 1700 తగ్గింది. తాజాగా గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ఇవాళ 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. వెయ్యి తగ్గింది. వెండి ధరసైతం భారీ తగ్గింది. కిలో వెండిపై 3,300 తగ్గింది. దీంతో కిలో వెండి ధర లక్షకు దిగువకు చేరింది. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల చివరి నాటికి బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

 • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
  తెలుగు రాష్ట్రాల్లో గురువారం బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో.. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,300కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,420.
 • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
  దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,450 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,570.
  ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,300 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,420.
  చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,500 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.73,640.
 • వెండి ధర ఇలా ..
  దేశ వ్యాప్తంగా వెండి ధర భారీగా తగ్గింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.
  తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.97,000
  దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ.97,000.
  కోల్ కతా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.92,500.
  బెంగళూరులో మాత్రం వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ.100 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 95,600 కు చేరింది.

 

 • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు