Weed sale made him Millionaire: జాబ్ వదిలేసి “మరిజువానా” సాగుతో కోట్లు సంపాదిస్తున్న యువకుడు

ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని అందిపుచ్చుకుని కోట్లు సంపాదిస్తున్నాడు."మరిజువానా" సాగుతో కోట్లు సంపాదిస్తు, భవిష్యత్ కు దిశానిర్దేశం చేసుకున్నాడు

Weed sale made him Millionaire: అవకాశాల కోసం ఎదురు చూడకూడదు సృష్టించుకోవాలి అనే నిర్వచనానికి ఉదాహరణ ఈ యువకుడు. చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేయలేక, నిస్పృహకులోనైన యువకుడు, ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని అందిపుచ్చుకుని కోట్లు సంపాదిస్తున్నాడు.”మరిజువానా”(గంజాయి లాంటి మొక్క) సాగుతో కోట్లు సంపాదిస్తు, భవిష్యత్ కు దిశానిర్దేశం చేసుకున్నాడు. అమెరికాకు చెందిన “కోలిన్ ల్యాండ్‌ఫోర్స్” అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ప్రారంభించిన “Unrivaled Brands” ఇప్పుడు మిలియన్ డాలర్ల వ్యాపారంగా అవతరించింది. అసలు ఏంటీ “మరిజువానా”?. అందులో అంత లాభాలు ఉన్నాయా?.

“మరిజువానా” అనేది పడమట దేశాల్లో పండే గంజాయి లాంటి మత్తు మొక్క. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా వంటి దేశాల్లో ఈ మొక్కను ఎండబెట్టి.. పొగాకుతో కలిపి సేవిస్తారు. అచ్చు గంజాయిలానే ఉండే ఈ మొక్కను “డ్రగ్స్”గా భావించి అక్కడి దేశాలు నిషేధం విధించాయి. అయినప్పటికీ కొందరు అక్రమంగా సాగు చేస్తూ కటకటాల పాలయ్యేవారు. అయితే 2017కు ముందు “మరిజువానా”పై పరిశోధనలు జరిపిన పరిశోధకులు.. ఈమొక్కను డ్రగ్స్ గా పరిగణించలేమని, సాధారణ పొగాకు, మద్యానికి ప్రత్యామ్న్యాయంగా పరిగణించవచ్చని నివేదిక రూపొందించారు. అంతే కాదు ఈమొక్కలో ఉన్న కొన్ని ఔషధ గుణాలు దీర్ఘకాలిక నొప్పి, ఆందోళన మరియు ఇతర అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేస్తాయని పేర్కొన్నారు. దీంతో ఈ మొక్కను పరిమిత సంఖ్యలో సాగు చేసుకోవచ్చంటూ 2017లో అమెరికా ప్రభుత్వం ఒక నియంత్రణ చట్టం చేసింది. ఆ చట్టమే “కోలిన్ ల్యాండ్‌ఫోర్స్”కు వరంగా ఎదురైంది. ప్రభుత్వం చట్టం తీసుకురావడంతోనే..కోలిన్..వెంటనే “మరిజువానా” సాగుపై దృష్టిపెట్టాడు. మొక్కను పండించి దాన్ని చట్టపరం చేస్తూ.. మొదటి ఏడాది $1.2 మిలియన్ల విలువైన “మరిజువానాను”(Pot అంటారు) గంజాయి పంపిణీ దారులకు సరఫరా చేసారు.

Also Read: Sunflower Cultivation : పొద్దుతిరుగుడు సాగులో తెగుళ్ళు…యాజమాన్యం

ఆనాటి నుంచి “మరిజువానా” సాగుపై పూర్తిగా ద్రుష్టి సారించిన కోలిన్.. మిలియన్ డాలర్ల వ్యాపారం చేసాడు. ఇప్పటి వరకు పంట పండించి సరఫరా మాత్రమే చేస్తున్న కోలిన్.. 2021 ఆరంభంలో “Terra Tech” అనే పబ్ కంపెనీతో కలిసి వ్యాపారాన్ని విస్తరించాడు. “Unrivaled Brands” పేరుతో మరిజువానా చుట్టలను, పొగాకు ఉత్పత్తులను సొంతంగా మార్కెట్లోకి విడుదల చేసాడు. ప్రస్తుతం మరిజువానా ఉత్పత్తులను చట్టపరంగా మార్కెట్లో అమ్ముతున్న కంపెనీలలో “Unrivaled Brands” అమెరికాలోనే టాప్ ప్లేస్ లో ఉంది. 2022లో ఈ సంస్థ $130 మిలియన్ డాలర్ల వ్యాపారం చేయొచ్చని అంచనా వేశారు. డిసెంబర్ 27న ట్విట్టర్ వేదికగా “కోలిన్ ల్యాండ్‌ఫోర్స్” తన విజయగాథను చెప్పుకొచ్చాడు. అంతే కాదు గతంలో అనధికారికంగా “మరిజువానా” సాగుచేసి అమెరికా చట్టాల ప్రకారం జైలుపాలై, ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్న వారి గురించి కూడా కోలిన్ ప్రస్తావించాడు. ప్రభుత్వం వారికి క్షమాబిక్ష పెట్టి విడుదల చేయాలనీ కోరుతున్నాడు కోలిన్.

Also read: Ratan Tata Birthday : కప్‌ సైజ్ కేక్‌..చిన్న క్యాండిల్..సింపుల్‌గా రతన్ టాటా బర్త్‌డే వేడుక

ట్రెండింగ్ వార్తలు