Viral Video : టీవీ షో లైవ్ నడుస్తోంది.. ఇద్దరు రాజకీయ నేతల మధ్య చర్చ కాస్తా హీటెక్కింది. తీవ్ర వాగ్వాదానికి దిగిన నేతలు చివరికి తన్నుకున్నారు. ఎక్కడంటే?
Suicide Blast in Pakistan: పాకిస్తాన్‌లోని మసీదులో ఆత్మహుతి దాడి.. 52 మంది మృతి 130 మందికి గాయాలు
పాకిస్తాన్ సెనేటర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్, షేర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్ ఇద్దరు తన్నుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్లో జరిగిన టీవీ పొలిటికల్ డిబేట్ కాస్త ఊహించని మలుపు తిరిగింది. జావేద్ చౌదరి హోస్ట్ చేసిన ప్రముఖ పాకిస్తానీ టాక్ షో ‘కల్ తక్’ లో ఈ ఘటన జరిగింది.
ఇమ్రాన్ ఖాన్ లాయర్ షేర్ అఫ్జల్ మార్వత్, నవాజ్ షరీఫ్ సెనేటర్ అఫ్నాన్ ఉల్లా మధ్య వాడీ వేడీ చర్చ జరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్‌పై అఫ్నాన్ ఉల్లా ఆరోపణలు చేయడంతో వారి వాదన కాస్త తీవ్ర రూపం దాల్చింది. ఈ ఆరోపణలపై మార్వాట్ ఎదురుదాడికి బదులుగా భౌతిక దాడికి దిగారు. అఫ్నాన్ ఉల్లా ఖాన్ తలపై కొట్టారు. ఆయన కూడా ఏ మాత్రం తగ్గకుండా తిరిగి దాడి చేసారు. దీంతో పరిస్థితి మరింత దిగజారింది.
Pakistan: అయ్యయ్యో పాకిస్తాన్.. అత్యంత దయనీయంగా ఆర్థిక పరిస్థితి.. పొలం పనుల్లోకి జవాన్లు
టీవీ డిబేట్ షో కాస్త పూర్తి స్ధాయి ముష్టి యుద్ధానికి దారి తీసింది. షో సిబ్బంది, హోస్ట్ వారిని నిలువరింపచేయడానికి చేసిన ప్రయత్నాలు వీక్షకులకు దిగ్భ్రాంతిని కలిగించాయి. ఇక ఈ నేతలిద్దరూ తాము చేసిన పనిని సమర్ధించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నారు. ఈ వీడియో చూసిన వారంతా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. తన్నుకున్న ఇద్దరు నేతలను ఆపడంలో ‘కల్ తక్’ హోస్ట్, సిబ్బంది విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ నేతల తన్నులాట మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Viral Video From Pakistan Social Media
Video Of The Fight Between Imran Khan’s PTI Lawyer Sher Afzal Khan Marwat And PMLN’S Senator Dr Afnan Ullah Khan 🤣#ImranKhan #PTI #PMLN pic.twitter.com/R3YWic1M1R
— OsintTV 📺 (@OsintTV) September 28, 2023