London: నో ప్యాంటు డే.. న్యూయార్క్ నగర వీధుల్లో ప్యాంటు లేకుండా తిరుగుతున్న యువతీయువకులు.. ఇదేం ఈవెంట్రా బాబోయ్..

2022లో న్యూయార్క్‌లో  నో ప్యాంట్స్ అనేది సబ్‌వే రైడ్‌లో ఓ భాగం. ఈ ఈవెంట్‌ను ఏడుగురు కుర్రాళ్లతో ఒక చిన్న ఆచరణాత్మక జోక్‌గా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ప్రపంచంలోని డజన్ల కొద్దీ నగరాల్లో యువత ఈ ఈవెంట్‌లో పాల్గొంటూ వచ్చారు. ఇదికాస్త, సోషల్ మీడియా ద్వారా వైరల్అవుతూ అంతర్జాతీయ ఈవెంట్‌గా విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 60కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఈ ఈ వెంట్ ను నిర్వహిస్తున్నారు.

London: ప్రపంచంలో పలు రకాల సంస్కృతులు, వింత ఆచారాలు మనకు నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఇలాంటి వింత ఘటనల్లో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పురుషులు, స్త్రీలు అనే బేధంలేకుండా ఆ ప్రాంతంలోని ప్రజలు ప్యాంటు వేసుకోకుండా వీధుల్లో సంచరిస్తూ కనిపించారు. బస్సు, మెట్రో, రోడ్లపై ఇలా ఎక్కడ చూసిన అధికశాతం మంది ప్యాంటు లేకుండానే మీకు తారసపడతారు. ఆడవారుసైతం కేవలం డ్రాయర్ మీదనే రోడ్లపై ఏంచక్కాతిరిగేస్తారు.

Commuters posing before boarding the no pants tube ride on Monday

ఇలాంటి వింత ఈవెంట్ యూఎస్‌ఏలోని న్యూయార్క్ నగరంలో కనిపిస్తుంది. అయితే ప్రతీరోజూ కాదు. కేవలం గ్లోబల్ ఈవెంట్ రోజుమాత్రమే. దీనిని నో ట్రౌజర్స్ డే అంటారు. అంతేకాదు నో ప్యాంటు డే అనికూడా పిలుస్తారు. లండన్‌లోని ప్రధాన వీధుల్లో నో ట్రౌజర్స్ డే పరేడ్‌లో పాల్గొంటారు. వీరంతా ప్యాంటు లేకుండా కేవలం నిక్కర్ లేదా డ్రాయర్ మీదమాత్రమే కనిపిస్తారు. ఇందులో మహిళలుసైతం అధికశాతంమందే పాల్గొంటారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి.

Hundreds of men and women boarded Elizabeth line without pants

ఈ ఈవెంట్‌ను ది స్టిఫ్ అప్పర్ లిప్ సొసైటీ ఏర్పాటు చేస్తుంది. కేవలం నవ్వించేందుకు మాత్రమే ఈ ఈవెంట్ నిర్వహిస్తామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. దీనిని సరదాగా తీసుకోవాలి. ఎవరి మనోభావాలు దెబ్బతీసేందుకు కాదని వారు కోరారు. గత ఏడాది ప్రారంభమైన ఎలిజబెత్ లైన్‌లో ఇరవై ఏళ్ల క్రితం న్యూయార్క్‌లో ప్రారంభమైన వార్షిక ఈవెంట్‌కు వందలాది మంది ప్రజలు అండర్‌వేర్‌లతో మాత్రమే ప్యాంట్ లేకుండా బస్సులు, మెట్రోల్లో ప్రయాణించారు. నో ట్రౌజర్ డేలో యువతీ, యువకులతో పాటు పెద్దలుకూడా పాల్గొంటారు.

Hundreds of men and women boarded Elizabeth line without pants.

2022లో న్యూయార్క్‌లో  నో ప్యాంట్స్ అనేది సబ్‌వే రైడ్‌లో ఓ భాగం. ఈ ఈవెంట్‌ను ఏడుగురు కుర్రాళ్లతో ఒక చిన్న ఆచరణాత్మక జోక్‌గా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ప్రపంచంలోని డజన్ల కొద్దీ నగరాల్లో యువత ఈ ఈవెంట్‌లో పాల్గొంటూ వచ్చారు. ఇదికాస్త, సోషల్ మీడియా ద్వారా వైరల్అవుతూ అంతర్జాతీయ ఈవెంట్‌గా విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 60కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఈ ఈ వెంట్ ను నిర్వహిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు