Video: జాబిల్లిపై ఇలా నడవాలి.. చిట్టి రోబోకు నేర్పిస్తున్న నాసా

జాబిల్లిపై మరింత సమర్థంగా పరిశోధన చేయాలని అంతరిక్ష అధ్యయనంలో ముందున్న దేశాలు భావిస్తున్నాయి.

జాబిల్లిపై నడవాలంటే అంత సులువు కాదు. అక్కడి వాతావరణ పరిస్థితులు.. ఎగుడు-దిగుడు ఉపరితలంలో మనుషులు ఉండలేరు. అక్కడి వాతావరణ పరిస్థితులు, మూలకాలపై అధ్యయనం చేసేందుకు అంతరిక్ష పరిశోధన కేంద్రాలు రోవర్, ల్యాండర్లను పంపిస్తుంటాయి.

జాబిల్లిపై మరింత సమర్థంగా పరిశోధన చేయాలని అంతరిక్ష అధ్యయనంలో ముందున్న దేశాలు భావిస్తున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జాబిల్లిపై మరిన్ని పరిశోధనలకు ఓ రోబో డాగ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ చిట్టి రోబోకు తాజాగా నడక నేర్పించారు శాస్త్రజ్ఞులు.

ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. 6,000 అడుగుల ఎత్తులో మంచు, బండరాళ్లతో ఉండే ఒరెగాన్ కొండల్లోని పలు ప్రాంతాల్లో తాజాగా ఇంజనీర్లు, ప్లానెటరీ శాస్త్రవేత్తలు ఈ రోబోకు నడక నేర్పించారు. ఈ రోబో శునకానికి స్పిరిట్ అని పేరు పెట్టారు. చతుర్భుజాకారంలో ఇది ఉంటుంది.

Also Read: రాహుల్ గాంధీ చెన్నై పర్యటనలో ఆసక్తికర సన్నివేశం.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు