FBI Reward : భారత్‌కు చెందిన ఈ వ్యక్తి ఆచూకీ చెబితే రూ.2కోట్లు రివార్డ్.. భార్యను చంపిన కేసులో అమెరికా పోలీసుల వేట

పది మంది మోస్ట్ వాంటెడ్ క్రిమిల్స్ జాబితాలో పటేల్ ను చేర్చిన ఎఫ్ బీఐ.. తాజాగా అతడి తలపై రూ.2కోట్ల రివార్డ్ ప్రకటించింది.

అమెరికా దర్యాఫ్తు సంస్థ ఎఫ్ బీఐ (యూఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఓ ఎన్నారై కోసం తీవ్రంగా గాలిస్తోంది. భార్యను చంపిన కేసులో అతడి కోసం ముమ్మరంగా వెతుకుతోంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి రూ.2కోట్లు రివార్డ్ ఇస్తామని అమెరికా దర్యాఫ్తు సంస్థ ఎఫ్ బీఐ ప్రకటించింది.

ఆ వ్యక్తి పేరు భద్రేశ్ కుమార్ చేతన్ బాయ్ పటేల్. గుజరాత్ రాష్ట్రానికి చెందిన పటేల్.. 2015, ఏప్రిల్ 12న అమెరికా మేరీల్యాండ్ లో తన భార్యను కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఆ తర్వాత పరారయ్యాడు. అప్పటి నుంచి ఈ క్రిమినల్ ఎన్ఆర్ఐ కోసం ఎఫ్ బీఐ గాలిస్తోంది. ఇంతవరకు అతడి ఆచూకీ తెలియలేదు. దీంతో పది మంది మోస్ట్ వాంటెడ్ క్రిమిల్స్ జాబితాలో పటేల్ ను చేర్చిన ఎఫ్ బీఐ.. తాజాగా అతడి తలపై రూ.2కోట్ల రివార్డ్ ప్రకటించింది.

మేరీల్యాండ్ లోని హనోవర్ లో డోనట్ షాపులో పటేల్ దంపతులు పని చేసేవారు. అప్పుడు పటేల్ వయసు 24ఏళ్లు. అతడి భార్య పాలక్ వయసు 21ఏళ్లు. షాపులో కస్టమర్ల ముందే పటేల్ తన భార్యను కిచెన్ లో ఉపయోగించే కత్తితో అత్యంత దారుణంగా పొడిచి చంపేశాడు. డంకిన్స్ డోనట్ స్టోర్ లో వారిద్దరూ నైట్ షిష్ట్ లో పని చేస్తున్నారు. ఆ సమయంలో ఈ దారుణం జరిగింది. హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. భార్యను చంపిన తర్వాత పటేల్ పారిపోయాడు. కోర్టు అతడికి 2015, ఏప్రిల్ 15న అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే, అప్పటి నుంచి అతడు దొరకలేదు. ఏళ్లు గడుస్తున్నా అతడి ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఈ క్రమంలో అమెరికా దర్యాఫ్తు సంస్థ ఎఫ్ బీఐ.. పటేల్ ఆచూకీ తెలిపిన వారికి రూ.2కోట్ల రివార్డ్ ఇస్తామని ప్రకటించింది.

Also Read : వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పేరుతో ఘరానా మోసం.. 19 లక్షలు పోగొట్టుకున్న మహిళ

ట్రెండింగ్ వార్తలు