Indian Businessman : కొడుకు 18వ పుట్టినరోజుకి తండ్రి కాస్ట్‌‌లీ గిఫ్ట్.. రూ.5 కోట్ల విలువైన లంబోర్ఘిని కారు.. వీడియో వైరల్!

Indian Businessman : భారతీయ వ్యాపారవేత్త వివేక్ కుమార్ రుంగ్తా తన కుమారుడు తరుణ్ రుంగ్తా 18వ పుట్టినరోజున ఏకంగా రూ. 5 కోట్ల విలువైన లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

Indian Businessman : మన భారతీయ వ్యాపారవేత్త అయిన వివేక్ కుమార్ రుంగ్తా తన కుమారుడు తరుణ్ రుంగ్తా 18వ పుట్టినరోజు సందర్భంగా అత్యంత ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. అదే.. లంబోర్ఘిని హురాకాన్ STO (సూపర్ ట్రోఫియో ఓమోలోగాటో). ఈ ఖరీదైన లంబోర్ఘిని కారు విలువ మార్కెట్లో రూ.5 కోట్లు ఉంటుంది. గత మార్చిలో ఈ కారును బహుమతిని అందుకున్నాడు తరుణ్ రుంగ్తా. అయితే, ఈ కారు వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అవుతుంది.

అంతేకాదు.. ఈ వీడియోకు తరుణ్ రుంగ్తా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన తండ్రికి ధన్యవాదాలు తెలిపాడు. లంబోర్ఘిని, డ్రీమ్ కారు అంటూ అనేక హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జత చేశాడు. యూఏఈకి చెందిన వివేక్ కుమార్ రుంగ్తా లాంబోర్ఘిని హురాకాన్ ఎస్టీఓ కోసం రూ. 5 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు చేసినట్లు నివేదిక వెల్లడించింది. వీకేఆర్ గ్రూప్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ స్థాపించగా మిడిల్ ఈస్ట్‌లో అతిపెద్ద కంపెనీగా కొనసాగుతోంది.

తరుణ్ రుంగ్తా షేర్ చేసిన వీడియోకు సంబంధించిన క్యాప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చాడు.. ‘నా 18వ పుట్టినరోజు సందర్భంగా నా డ్రీమ్ కారు బహుమతిగా ఇచ్చి మరింత అద్భుతంగా మార్చినందుకు నా తండ్రి వివేక్‌ కుమార్‌ రుంగ్తాకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ప్రేమ, మద్దతు నాకు ఎప్పుడూ ఉండాలి’ అంటూ పోస్టు చేశాడు. అంతేకాదు.. ఇన్‌స్టాగ్రామ్ బయోలో కూడా లాంబోర్ఘిని కారుపై మక్కువను అభివర్ణించింది. అంటే.. అతడికి కార్ల పట్ల ఎంత ఇష్టం ఉందో తెలియజేస్తుంది.

ఎల్లో లంబోర్ఘిని లగ్జరీ కారు వీడియో వైరల్ :
వీడియో విషయానికి వస్తే.. తండ్రీకొడుకులు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి లంబోర్ఘిని డీలర్‌షిప్‌లోకి ప్రవేశించినట్టుగా కనిపిస్తోంది. కారుపై ఒక నల్లటి క్లాత్ కప్పబడి ఉండగా.. ఆ తర్వాత దాన్ని తొలగించారు. తరుణ్ ఆ కారును చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. లంబోర్ఘిని జాబితా ప్రకారం.. స్పోర్ట్స్ కారు కలర్ గియాల్లో బెలెనస్.

చివరగా, కుటుంబ సభ్యులకు మెరిసే కొత్త కారు కీలను అందించారు. డీలర్‌షిప్ నుంచి బయటకు వెళ్లే ముందు తండ్రికొడుకు కేక్ కట్ చేశారు. పసుపు వర్ణంలోని లంబోర్ఘిని లగ్జరీ కారును ఆవిష్కరించిన తరుష్ తన తండ్రి వివేక్‌ను ఆనందంతో కౌగిలించుకుని ధన్యవాదాలు తెలిపాడు. గత నెలలో ఈ వీడియోను పోస్ట్ చేయగా ఇప్పటివరకూ 41.629కు పైగా లైక్స్ వచ్చాయి.

2023లో తరుణ్ రుంగ్తా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రకారం.. పుట్టినరోజు బహుమతిగా హమ్మర్‌ను కొనుగోలు చేశారు. హురాకాన్ ఎస్టీఓ సహజంగా 5.2-లీటర్ వి10 ద్వారా పవర్ అందిస్తుంది. బ్యాక్ చక్రాలకు మాత్రమే పవర్ ఉంటుంది. ఈ కారు 8వేల ఆర్పీఎమ్ వద్ద 631bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇ సెకన్లలో గంటకు 0 నుంచి 11 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

ట్రెండింగ్ వార్తలు