ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసున్న అవిభక్త కవలలుగా గుర్తింపు పొందిన లోరీ, జార్జ్ కన్నుమూత

లోరీ, జార్జ్ షాపెల్‌ మరణవార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యామని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ తమ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది.

ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసున్న అవిభక్త కవలలుగా గుర్తింపు పొందిన లోరీ, జార్జ్ షాపెల్ కన్నుమూశారు. వారి బయసు 62. తలలు అతుక్కుని ఈ కవలలు పుట్టారు. వారు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ఆసుపత్రిలో మృతి చెందారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

లోరీ, జార్జ్ షాపెల్‌ మరణవార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యామని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ తమ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ఆ అవిభక్త కవలల్లో జార్జ్ గాయకురాలిగా, లోరీ టెన్-పిన్ బౌలర్ ట్రోఫీ విన్నర్ గానూ పేరు తెచ్చుకున్నారని పేర్కొంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. లోరీ, జార్స్ కి 62 సంవత్సరాల 202 రోజుల వయస్సు.

వీరు 1961, సెప్టెంబరు 18న జన్మించారు. కీలకమైన రక్త నాళాలు, మెదడులో 30 శాతం భాగం కలిసిపోయి.. తలలు అతుక్కుని పుట్టారు. అయినప్పటికీ వారిద్దరు వేర్వేరు రంగాల్లో రాణించడం గమనార్హం.

లోరీ 1990వ దశకంలో కొన్నేళ్ల పాటు ఆసుపత్రి లాండ్రీలో పనిచేశారు. 2007లో జార్జ్ తనను తాను ట్రాన్స్‌జెండర్‌గా ప్రకటించుకున్నారు. ఈ అవిభక్త కవలలు ప్రపంచంలోనే మొట్టమొదటి స్వలింగ సంయోగ కవలలుగానూ గుర్తించపుపొందారు. పెన్సిల్వేనియాలోని డబుల్ బెడ్రూం అపార్ట్మెంట్లో ఈ కవలలు నివసించేవారు.

కెనడాలో ఘోరం.. కారులో కూర్చున్న భారతీయ విద్యార్థిని కాల్చి చంపిన దుండగుడు 

ట్రెండింగ్ వార్తలు