Sydney stabbing : దారుణం.. షాపింగ్ మాల్లో కత్తిపోట్ల కలకలం.. ఐదుగురి మృతి.. దుండగుడిని షూట్ చేసి చంపిన మహిళా పోలీస్
మధ్యాహ్నా సమయం అయినప్పటికీ శనివారం కావడంతో షాపింగ్ మాల్ చాలా రద్దీగా ఉంది
- Thota Vamshi Kumar
- Updated on- April 13, 2024 / 03:47 PM IST
sydney stabbing Multiple stabbed Several dead at Bondi Mall complex
మధ్యాహ్నా సమయం అయినప్పటికీ శనివారం కావడంతో షాపింగ్ మాల్ చాలా రద్దీగా ఉంది. తమకు కావాల్సిన వస్తువులను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. తల్లిదండ్రులతో వచ్చిన పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంతలో మాల్‌లోకి ప్రవేశించిన ఓ దుండగుడు అక్కడ ఉన్న వారిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఐదుగురు మరణించారు. ఈ దారుణ ఘటన ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో చోటు చేసుకుంది.
బోండిలోని వెస్ట్‌ఫీల్డ్ షాపింగ్ సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన నిందితుడిని పట్టుకునే క్రమంలో ఓ మహిళా పోలీసు అధికారి కాల్పుల్లో అతడు మరణించాడు.
దుండగుడి దాడిలో మొత్తం 9 మంది కత్తిపోట్లకు గురైయ్యారు. వీరిలో ఐదుగురు మరణించారు. కాగా.. ఈఘటనలో మాల్లో వందల సంఖ్యలో ఉన్న జనం ఒక్కసారిగా బయటకు పరుగులు తీసినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అక్కడి పరిస్థితి భయానకంగా ఉందని చెబుతున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Video: జాబిల్లిపై ఇలా నడవాలి.. చిట్టి రోబోకు నేర్పిస్తున్న నాసా
ఈ దాడికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో ఓ వ్యక్తి పెద్ద కత్తి పట్టుకుని తిరగడం కనిపిస్తోంది. గాయపడిన వారు నేల పై పడిపోయారు. వారిలో తల్లీబిడ్డ ఉన్నారు. నిందుతుడు ఎందుకు దాడికి పాల్పడ్డాడు అన్న విషయాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
