Allu Arjun : అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాబో మూవీ సోషల్ ఫాంటసీనా..? మహాభారతంలోని కథతో రెండు పార్ట్‌లుగా..!

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ సోషల్ ఫాంటసీ అనేది నిజమేనా..? మహాభారతంలోని రెండు పర్వాలను తీసుకొని రెండు పార్ట్‌లుగా తీస్తున్నారా..!

Allu Arjun Trivikram Srinivas movie is Socio Fantasy with mahabharat

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన.. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి వెండితెర పై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అల్లుఅర్జున్ 22వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.

Bro First Single My Dear Markandeya : రెడీగా ఉండండి.. బ్రో నుంచి ఫ‌స్ట్ సింగిల్‌కు టైమ్ ఫిక్స్‌..

ఈ ప్రాజెక్ట్ పై అందరిలో భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా గురించి కొన్ని వార్తలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రాబోతుందట. ఇక స్టోరీ విషయంలో.. ఇది ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ స్టోరీ అని, సోషల్ ఫాంటసీ మూవీ అని గాసిప్స్ వస్తున్నాయి. అయితే అవేవీ కాదని మహాభారతంలోని రెండు పర్వాలను తీసుకొని ఆ స్టోరీలైన్‌కు మోడ్రన్ టచ్ ఇచ్చి రెండు పార్ట్‌లుగా తీయాలనే ఆలోచనతో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దళపతి సినిమాలా ఈ కథ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ త్వరలోనే బయటకు రానున్నాయి.

Baby Trailer : అమ్మాయిల కంటే గట్టిగా అబ్బాయిల గుండెల మీద ఎవరు కొట్టలేరు.. ట్రూగా ప్రేమించే అబ్బాయిలా కథే బేబీ..!

ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి వీటిలో ఎంత నిజం ఉందో తెలియదు. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా వైడ్ అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ పై భారీ హైప్ నెలకుంది. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ కూడా 2021 డిసెంబర్ లోనే రిలీజ్ అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు