Judge Delivered In Govt Hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా న్యాయమూర్తి ప్రసవం.. ఆదర్శంగా నిలిచిన జడ్జి

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఉన్నత హోదాలో ఉన్నవారు సైతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పురుడు పోసుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఏకంగా ఓ మహిళా న్యాయమూర్తే ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు.

Judge Delivered In Govt Hospital : ‘నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు’ అనే పాత పాట మీకు గుర్తుందా? సామాన్యులకు రోగాలు వస్తే ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటేనే భయపడేవారు. ఉన్నత వర్గాల వారైతే అటు వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. కానీ ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడ్డాయి. ఉన్నత హోదాలో ఉన్నవారు సైతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పురుడు పోసుకునేందుకు ముందుకు వస్తున్నారు.

తాజాగా ఏకంగా ఓ మహిళా న్యాయమూర్తే ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. దీంతో ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచారు. వరంగల్ జిల్లా పాపయ్యపేట చమన్ ప్రాంతానికి చెందిన రాచర్ల షాలిని ఆర్మూర్ జిల్లా కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త ప్రశాంత్ హైదరాబాద్ లోని హయత్ నగర్ కు చెందిన ఓ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జడ్జి షాలినికి పురిటి నొప్పులు రావడంతో హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. సామాన్య మహిళ లాగానే వెళ్లిన ఆమెకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Government Hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడ పిల్లకు జన్మనిచ్చిన అడిషనల్ కలెక్టర్

శస్త్రచికిత్స ద్వారా ఆమెకు ప్రసవం చేశారు. ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించేందుకే తాను ఇక్కడ ప్రసవం చేయించుకున్నానని జడ్జి షాలిని తెలిపారు. అయితే జూనియర్ సివిల్ జడ్జి హోదాలో ఉన్న షాలిని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించడం అభినందనీయమని డీఎంహెచ్ వో సాంబశివరావు కొనియాడారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, డాక్టర్ సరళాదేవి ఆధ్వర్యంలో జడ్జి షాలినికి కేసీఆర్ కిట్ ను అందజేశారు.

ట్రెండింగ్ వార్తలు