Balka Suman: గందరగోళ పరిస్థితి నెలకొంది: బాల్క సుమన్

Balka Suman: తెలంగాణ స్పీకర్ కూడా అటువంటి నిర్ణయమే తీసుకోవాలని చెప్పారు.

Balka suman

తెలంగాణలో పాలనను గాలికి వదిలేశారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. రాష్ట్ర విద్యాశాఖలో గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పారు. రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విత్తనాలు, ఎరువుల సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.

విద్య, హోం శాఖలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయని బాల్క సుమన్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే దారుణాలు జరుగుతున్నాయని, ఓ వ్యక్తిని అందరూ చూస్తుండగానే కొట్టి చంపారని అన్నారు. హైదరాబాద్‌లో దోపిడీలు జరుగుతున్నాయని తెలిపారు. గంజాయి ముఠాలు రెచ్చిపోతున్నాయని అన్నారు.

అలాగే, హైదరాబాద్ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారిందని, విశ్వనగరం ఇప్పుడు విషాద నగరంగా మారుతోందని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని కోరుతున్నామని తెలిపారు. ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేశారని అన్నారు. తెలంగాణ స్పీకర్ కూడా అటువంటి నిర్ణయమే తీసుకోవాలని చెప్పారు. బీజేపీ గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని అన్నారు.

పోలీసులు బారికేడింగ్‌ ఏర్పాటు చేయడంతో సీఎం చంద్రబాబు ఆగ్రహం.. ఏమన్నారో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు