‘దొరల పాలన’ అంటూ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన కామెంట్స్

V Hanumantha Rao: తెలంగాణలో దొరల పాలన మళ్లీ వచ్చిందని చెప్పారు. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… బీఆర్ఎస్ పాలనలో పేదల భూములు తిరిగి దొరలకు ఇచ్చారని చెప్పారు.

ఇందిరా గాంధీ హయాంలో మాదిగలకు 94 ఎకరాల భూమిని 10 మందికి ప్రభుత్వం కీసరలో ఇచ్చిందని వీహెచ్ తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో రాగి కృష్ణారెడ్డి దురుద్దేశంతో సంతకాలు పోర్జరి చేసి పట్టాలు చేయించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోవడంలేదని తెలిపారు.

ఆ భూముల్లో వెంటనే పనులు ఆపేయాలని వీహెచ్ అన్నారు. పేదలు భూములు కోల్పోతే, మరోవైపు అక్కడ విల్లాలు కడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎవరి భూమి వారికే అన్నారని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పటికీ ఏం జరుగుతోందని నిలదీశారు.

ఇది వందల కోట్ల రూపాయల కుంభకోణమని వీహెచ్ అన్నారు. తెలంగాణలో దొరల పాలన మళ్లీ వచ్చిందని చెప్పారు. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని అన్నారు. 10 రోజుల్లో దీనిని ప్రభుత్వం తేల్చకపోతే ఆ భూమిలోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.

Also Read: ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ టీచర్ మర్డర్.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు..

ట్రెండింగ్ వార్తలు