కేసీఆర్‌ని దేవుడు కూడా కాపాడలేడు.. ఇప్పటికే జైల్లో కవిత: మంత్రి కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy: కేసీఆర్ అక్రమ సంపాదన అంతా ఆయన ఎనిమిది మంది అక్కాచెల్లెళ్లకు పంచారని ఆరోపించారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తప్పు చేశారు కాబట్టే ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉన్నారని తెలిపారు.

యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కేసీఆర్ జైలుకు జైలుకు వెళ్తారని, ఆయనను దేవుడు కూడా కాపాడలేడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ అక్రమ సంపాదన అంతా ఆయన ఎనిమిది మంది అక్కాచెల్లెళ్లకు పంచారని ఆరోపించారు. కేవలం 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నాగారంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి బంగ్లా కట్టారని తెలిపారు.

తాను ఆరు సార్లు గెలిచినప్పటికీ సొంత ఇల్లు కట్టుకోలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. జూన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని తాను ముందే చెప్పానని తెలిపారు. బీజేపీలో బీఆర్ఎస్‌ని విలీనం చేద్దామని కేసీఅర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ చేస్తుంటే కేసీఆర్ వ్యతిరేకించడం హాస్యాస్పదమని తెలిపారు. అవినీతి చేస్తే వదిలేయాలా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి అవినీతి చేశారని ఆరోపించారు.

Also Read: ‘దొరల పాలన’ అంటూ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు