O Saathiya Trailer : పాన్‌ ఇండియా లెవెల్‌లో విజయవాడ అబ్బాయి సినిమా.. ‘ఓ సాథియా’ ట్రైలర్ రిలీజ్!

విజయవాడ నుంచి హీరో అవ్వాలని వచ్చి ఈరోజు 'ఓ సాథియా' అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని..

Aryan Gowra Mishti Chakravarty O Saathiya Trailer released

O Saathiya Trailer : ప్రేమ కథల్లో కొత్త కోణం తీసుకొని నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కించారు. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 7న పాన్‌ ఇండియా లెవెల్‌లో భారీగా విడుదల కాబోతోంది.

Upasana : డెలివ‌రీకి ముందు.. రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల ఆనందాన్ని చూశారా..?

తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ RK సినీ ప్లెక్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత KS రామారావు, ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన విచ్చేశారు. వారితో పాటు చిత్రయూనిట్, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నిర్మాత KS రామారావు గారి చేతుల మీదుగా ఓ సాథియా ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్ లవ్ అండ్ సస్పెన్స్ స్క్రీన్ ప్లేతో ఉండి ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. కాగా ఈ చిత్రాన్ని UFO లాంటి సంస్థ ఈ సినిమాని రిలీజ్ చేయడం విశేషం.

Allu Sirish : ఇన్నాళ్లు దాచా.. నాలోని అభిమాని వ‌ల్ల ఇక కుద‌ర‌లేదు

ఇక ఈ కార్యక్రమానికి అథిలుగా వచ్చిన KS రామారావు, త్రినాథరావు నక్కిన మూవీ టీంకి అభినందనలు మరియు అల్ ది బెస్ట్ తెలియజేశారు. ఈ మూవీ హీరో ఆర్యన్ మాట్లాడుతూ.. “విజయవాడ కృష్ణలంకలో చిన్నప్పటి నుంచి కన్న కల హీరో అవ్వాలని. ఆ కల ఇవ్వాళ నన్ను ఇప్పుడు ఇక్కడ నిలబెట్టింది. ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్ళు అయింది. అవకాశాల కోసం తిరిగాను. నేను ఫేస్ చేసిన కొన్ని పరిస్థితులతో బాధపడి నేను నా సొంతంగా హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యాను. అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకొని లాక్ డౌన్ లో హీరోగా, డైరెక్టర్ గా సినిమా తీశాను. నా మొదటి సినిమా బడ్జెట్ 40 లక్షలు, హిట్ చేసి నిర్మాతకు డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ 6 కోట్లు. నైట్ జాబ్ చేసుకుంటూ పొద్దున సినిమా చేసుకుంటూ చాలా కష్టపడ్డాను. ఆడియన్ పాయింట్ అఫ్ వ్యూలో ఆలోచించి వాళ్ళు పెట్టే డబ్బులకు న్యాయం చేయాలని కష్టపడ్డాను” అంటూ చెప్పుకొచ్చాడు.

 

ట్రెండింగ్ వార్తలు