Asia Cup 2023: ఆగస్టు 31 నుంచి ఆసియా కప్… 4 మ్యాచులు పాక్‌లో, మరో తొమ్మిదేమో…

గ్రూప్ 1లో భారత్, పాకిస్థాన్, నేపాల్ ఉన్నాయి.

Asia Cup 2023

Asia Cup 2023 : ఆసియా కప్‌-2023 పాకిస్థాన్ (Pakistan), శ్రీలంక(Sri Lanka)లో జరగనుంది. ఆగస్ట్‌ 31 నుంచి మ్యాచులు ప్రారంభమై సెప్టెంబర్ 17న ముగుస్తాయి. ఈ మేరకు ఏషియన్‌ క్రికెట్‌ కౌన్సిల్ ప్రకటన చేసింది. గ్రూప్ దశ, సూపర్ 4, ఫైనల్ మ్యాచ్ వన్డే ఫార్మాట్లో జరుగుతాయి. నాలుగు మ్యాచులు పాకిస్థాన్ లో, తొమ్మిది మ్యాచులు శ్రీలంకలో జరుగుతాయి.

గ్రూప్ 1లో భారత్, పాకిస్థాన్, నేపాల్ ఉన్నాయి. గ్రూప్ 2లో శ్రీలంక, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ కొనసాగుతాయి. మొత్తం 18 రోజులపాటు జరిగే ఈ టోర్నీ హైబ్రిడ్‌ మోడల్‌లో ఉంటుంది. పాకిస్థాన్ లో దాదాపు15 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌ జరుగుతుంది. భారత్, పాకిస్థాన్‌ మధ్య జరిగే మ్యాచులు ఫ్యాన్స్ కు పండుగే.

శ్రీలంకలోనే భారత్ మ్యాచులు ఆడనుంది. పాకిస్థాన్‌లో ఆడేందుకు బీసీసీఐ నిరాకరించిన విషయం తెలిసిందే. సూపర్‌ 4 మ్యాచులు శ్రీలంకలో జరుగుతాయి. ఇందులో గెలిచిన రెండు జట్లు ఫైనల్ ఆడతాయి. ఆసియా కప్ ను గత ఏడాది టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు.

శ్రీలంక ఆసియా కప్‌ విజేతగా నిలిచింది. జులైలో వెస్టిండీస్ తో భారత్ రెండు టెస్టు మ్యాచులు, మూడు వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది. ఆ తర్వాత టీమిండియా, ఐర్లాండ్ మధ్య మూడు టీ20 మ్యాచులు జరుగుతాయి. అనంతరం సెప్టెంబరులో ఆసియా కప్ ఉంటుంది.

Premier Handball League: తెలుగు టాలన్స్‌ ఘన విజయం

ట్రెండింగ్ వార్తలు