Premier Handball League: తెలుగు టాలన్స్‌ ఘన విజయం

తెలుగు టాలన్స్‌ మొత్తం 48 సార్లు గోల్‌ ప్రయత్నం చేసింది. అందులో 28 గోల్స్‌ సాధించింది.

Premier Handball League

Premier Handball League -Rajasthan: ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (PHL-2023) తొలి సీజన్లో తెలుగు టాలన్స్‌ (Telugu Talons) మూడో విజయం నమోదు చేసింది. రాజస్థాన్ జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన గ్రూప్‌ దశ జరిగింది.


Premier Handball League

రాజస్థాన్‌ పాట్రియాట్స్‌పై 28-24 తేడాతో తెలుగు టాలన్స్ ఘన విజయం సాధించింది. తెలుగు టాలన్స్‌ మొత్తం 48 సార్లు గోల్‌ ప్రయత్నం చేసింది. అందులో 28 గోల్స్‌ సాధించింది. గ్రూప్‌ దశలో 5 మ్యాచులు ఆడిన తెలుగు టాలన్స్‌కు ఇది మూడో విజయం. తాజాగా మ్యాచులో 14 నిమిషాల వద్ద 6-6తో టాలన్స్‌, పాట్రియాట్స్‌ సమవుజ్జీలుగా నిలిచాయి.


Premier Handball League

అనంతరం రాజస్థాన్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ సమయంలో 9-7తో రెండు పాయింట్ల ముందంజలో నిలిచింది రాజస్థాన్‌. తెలుగు టాలన్స్‌ చివరకు పుంజుకున్నా విరామ సమయానికి 14-13తో రాజస్థాన్‌ ఆధిక్యంలో ఉంది. ద్వితీయార్థంలో తెలుగు అద్భుతంగా రాణించింది. నాలుగు గోల్స్‌ తేడాతో తెలుగు టాలన్స్‌ విజయం సాధించింది.


Premier Handball League

Premier Handball League


Premier Handball League

Wimbledon Prize Money: భారీగా పెరిగిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఫ్రైజ్‌మనీ.. గతేడాదితో పోలిస్తే ఎంత పెరిగిందంటే..

ట్రెండింగ్ వార్తలు