Wimbledon Prize Money: భారీగా పెరిగిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఫ్రైజ్‌మనీ.. గతేడాదితో పోలిస్తే ఎంత పెరిగిందంటే..

ఈ సంవత్సరం ఛాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న ఆటగాళ్లకు రికార్డ్ ఫ్రైజ్ మనీని అందించడం మాకు ఆనందంగా ఉందని AELTC చైర్మన్ ఇయాన్ హెవిట్ అన్నారు.

Wimbledon Prize Money

Wimbledon 2023: : వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఫ్రైజ్‌మనీ పెరిగింది. ఈ ఏడాది వింబుల్డన్‌లో 56.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 464 కోట్లు) ఫ్రైజ్‌మనీగా ఇవ్వనున్నట్లు ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ (AELTC) బుధవారం ప్రకటించింది. 2022లో ఫ్రైజ్‌మనీతో పోలిస్తే ప్రస్తుతం ప్రైజ్‌మనీ విలువ 11.2శాతం అదనం. అదేవిధంగా పురుషులు, మహిళల సింగిల్స్‌లో ఒక్కో విజేతకు మూడు మిలియన్ డాలర్లు (సుమారు రూ. 24.60కోట్లు) దక్కనున్నాయి. తొలి రౌండ్‌లో ఓడిన క్రీడాకారులకు ఒక్కొక్కరికి 69,500 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 57లక్షలు) లభిస్తాయి.

MS Dhoni : వ‌చ్చే సీజ‌న్ ధోని ఆడ‌డా..? సీఎస్‌కే పోస్ట్ చేసిన వీడియోకి అర్థం అదేనా..?

ఈ సంవత్సరం ఛాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న ఆటగాళ్లకు మెజారిటీ ఈవెంట్‌లలో రెండంకెల పెరుగుదలతో రికార్డ్ ఫ్రైజ్ మనీని అందించడం మాకు ఆనందంగా ఉందని AELTC చైర్మన్ ఇయాన్ హెవిట్ అన్నారు. ఫ్రైజ్ మనీని భారీగా పెంచడానికి కారణాన్ని వివరించారు. 2019 కరోనా మహమ్మారికి ముందు సింగిల్స్ ఛాంపియన్‌లు, రన్నర్స్ -ఆప్ ఫ్రైజ్ మనీని స్థాయిలకు తిరిగి ఇవ్వడం, దానితోపాటు ఈవెంట్ ప్రారంభ రౌండ్‌లలో ఆటగాళ్లకు తగిన మద్దతును అందించడంకోసం ఈ నిర్ణయం తీసుకోవటంజరిగిందని తెలిపారు.

Coin toss : కొత్త రూల్‌.. వ‌ర్షం వ‌ల్ల మ్యాచ్ జ‌రుగ‌కపోతే.. కాయిన్ టాస్ విజేత‌.. ఇదేం దిక్కుమాలిన నిబంధ‌న అంటున్న ఫ్యాన్స్‌

ఇదిలాఉంటే.. ఈ  వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌లు జూలై 3 నుంచి 16వ తేదీ వరకు పురుషులు, మహిళల విభాగాల్లో జరుగుతాయి. ఈ ఏడాది ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకోవడానికి నోవాక్ జకోవిచ్, ఇగా స్విటెక్‌లు ఫేవరెట్‌లుగా నిలవనున్నారు. ఇద్దరూ ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలుచుకున్నారు. జకోవిచ్ ప్రస్తుతం 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను కలిగి ఉన్నాడు. 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం జకోవిచ్ పట్టుదలతో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు