NBK107: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనమందరం చూశాం. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో నటించగా, అఘోరా పాత్రలో బాలయ్య పర్ఫార్మెన్స్ మరో లెవెల్లో ఉంది. ఇక ఈ సినిమాకు బోయపాటి శ్రీను కథ, థమన్ సంగీతం కలగలిసి ‘అఖండ’కు అఖండమైన విజయాన్ని అందించాయి. ఈ సినిమాతో టాలీవుడ్‌కు బూస్టప్ ఇచ్చిన బాలయ్య, వెంటనే తన నెక్ట్స్ మూవీని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నాడు.
NBK107: బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తున్న బాలయ్య..?
ఈసారి కూడా పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కథతో బాలయ్య మనముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటుండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా షికారు చేస్తోంది. ఔట్ అండ్ ఔట్ బాలయ్య మార్క్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు అనేక టైటిల్స్‌ను పరిశీలించాక, ‘‘అన్నగారు’’ అనే టైటిల్ అయితే ఈ సినిమాకు పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావించిందట. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తుండగా, అందులో ఒక గెటప్‌కు సంబంధించిన లుక్‌ను ఇప్పటికే రిలీజ్ చేశారు.
NBK107: బాలయ్య కోసం భారీ ఇల్లు.. ఎక్కడో తెలుసా?
దీంతో ఇప్పుడు ఈ సినిమాకు, బాలయ్య మేనరిజానికి అన్నగారు అనే టైటిల్ పర్ఫెక్ట్గా సరిపోతుందని అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అఖండతో విజయఢంకా మోగించిన బాలయ్య, ‘అన్నగారు’తో టాలీవుడ్‌కు నిజమైన ‘అన్నగారు’గా మారుతారని వారు ఆశిస్తున్నారు. ఇక గోపీచంద్ మలినేని ఈ సినిమాను పక్కా ప్లానింగ్‌తో తెరకెక్కిస్తుండగా, కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను రెడీ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.