Bandi Sanjay: కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్‌లను ఉద్దేశిస్తూ బండి సంజయ్ మరో ఆసక్తికర ట్వీట్..

బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడంతో బీజేపీలోని పలు వర్గాల నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం చేసిన సంజయ్ ను మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగుతాయన్న సమయంలో తొలగించడం పట్ల వారు కేంద్ర పార్టీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

BJP MP Bandi Sanjay

BJP MP Bandi Sanjay: తెలంగాణ బీజేపీ (Telangana BJP) లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. బండి సంజయ్‌ (Bandi Sanjay) ను అధ్యక్ష స్థానం నుంచి తొలగిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా (JP Nadda) ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Etela Rajender) కు బీజేపీ కేంద్ర నాయకత్వం కీలక పదవిని అప్పగించింది. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటలను నియమిస్తూ జేపీ నడ్డా ప్రకటన విడుదల చేశారు. అయితే, అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బండి సంజయ్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది.

Bandi Sanjay: బండి సంజయ్ ఔట్.. ఎక్కడ తేడా కొట్టింది.. కిషన్ రెడ్డి ముందున్న సవాళ్లు ఏంటి?

రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు సంజయ్‌కు సమాచారం అందగానే మంగళవారం సాయంత్రం బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి నిష్ర్కమిస్తున్నట్లు బండి సంజయ్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన పదవీకాలంలో అండగా నిలిచిన ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్ర సమయంలో తనను స్వాగతించిన ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్టుల చేసిన సమయంలో తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో మరింత ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తానని సంజయ్ వెల్లడించారు.

Kishan Reddy : టీబీజేపీ నయా బాస్‌ కిషన్‌ రెడ్డి

మరోవైపు బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడంతో బీజేపీలోని పలు వర్గాల నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం చేసిన సంజయ్ ను మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగుతాయన్న సమయంలో తొలగించడం పట్ల వారు కేంద్ర పార్టీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ తొలగింపుతో బీజేపీ కార్యకర్త, సంజయ్ అభిమాని ఆత్మహత్యాయత్నంసైతం చేశారు. మరోవైపు బండి సంజయ్ కేంద్ర పార్టీ నిర్ణయం పట్ల అసంతృప్తిలో ఉన్నారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం ఉదయం బండి సంజయ్ మరో ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్రఅధ్యక్షునిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమితులైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అభినందనలు తెలిపారు. అనుభవజ్ఞులైన, సమర్థులైన మీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నానని బండి సంజయ్ ట్విట్‌లో పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు