India vs Bangladesh Match: పుంజుకుంటారా? టీమిండియాకు పరీక్ష.. నేడు బంగ్లాదేశ్‌తో రెండో వన్డే ..

టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్ జట్టుతో ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో రెండో వన్డే మ్యాచ్ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి వన్డేలో ఓటమి‌పాలైన టీమిండియా.. రెండో వన్డేలో విజయం సాధించి పట్టునిలుపుకొనేందుకు పట్టుదలతో ఉంది

India vs Bangladesh Match: టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్ జట్టుతో ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో రెండో వన్డే మ్యాచ్ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి వన్డేలో ఓటమి‌పాలైన టీమిండియా.. రెండో వన్డేలో విజయం సాధించి పట్టునిలుపుకొనేందుకు పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ లో ఒత్తిడి భారత్ పైనే ఉంది. తొలి వన్డేలో బ్యాటింగ్‌లో తడబడ్డా బౌలింగ్‌లో రాణించి గట్టెక్కేలా కనిపించిన టీమిండియా.. చివరిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తొలి మ్యాచ్ లో కేఎల్ రాహుల్ మినహా మిగిలిన బ్యాటర్లు అందరూ పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు. రెండో వన్డేలో కోహ్లీ, రోహిత్, ధావన్ లాంటి బ్యాటర్లు క్రిజ్ లో కుదురుకుంటే భారత్ పరుగుల వరదపారించడం ఖాయం అవుతుంది. అయితే, బంగ్లా బౌలర్ల దాటిని టీమిండియా బ్యాటర్లు రెండోవన్డేలో ఏ విధంగా ఎదుర్కొంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.

Bangladesh vs India: ఒక్క వికెట్ తేడాతో టీమిండియాపై గెలిచిన బంగ్లాదేశ్

టీమిండియా పేలవ ఫీల్డింగ్ కూడా మొదటి వన్డేలో ఓటమి కారణమనే చెప్పాలి. ముఖ్యంగా కేఎల్ రాహుల్ వదిలిపెట్టిన క్యాచ్ మూలంగానే మొదటి వన్డేలో టీమిండియా ఓడిపోయిందని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాహుల్ తో పాటు పలువురు ఆటగాళ్లు చెత్త ఫీల్డింగ్ కారణంగానూ బంగ్లా విజయానికి బాటలు వేశాయి. మరోవైపు.. బంగ్లాదేశ్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ముస్తాఫిజుర్, ఎబాదత్, హసన్ మహమూద్, షకీబ్, మొహదీ హసన్ లతో బంగ్లా బౌలింగ్ బలంగా ఉంది. బ్యాటింగ్ లోనూ ఆ జట్టు రాణిస్తుంది. అయితే తొలి వన్డేలో బంగ్లా బ్యాటర్లు టీమిండియా బౌలర్ల దాటికి క్రిజ్ లో ఎక్కువసేపు నిలబడలేక పోయారు. టీమిండియా బౌలర్లు రెండో వన్డేలోనూ మొదటి వన్డే తరహా బౌలింగ్ ప్రదర్శనను ఇస్తే టీమిండియా గెలుపులో కీలక భూమిక అవుతుంది.

India vs New Zealand: టీమిండియా ఆత్మపరిశీలన చేసుకోవాలి: ఓటమిపై శ్రేయాస్ అయ్యర్

భారత్ చివరి సారి 2015లో బంగ్లాలో ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. అప్పుడు ధోని నేతృత్వంలోని జట్టు 1-2 తో సిరీస్ ను చేజార్చుకుంది. ఆ ఒక్క విజయాన్ని కూడా నామమాత్ర మ్యాచ్ లో సాధించింది. మరోసారి చరిత్రను పునరావృతం చేసేందుకు బంగ్లా క్రీడాకారులు పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో నేడు జరిగే మ్యాచ్ లో టీమిండియా ఓడిపోతే.. వరుసగా బంగ్లా దేశ్ లో రెండో వన్డే సిరీస్ ను చేజార్చుకోవాల్సి వస్తుంది.

ట్రెండింగ్ వార్తలు