Korra Cultivation : అండు కొర్రల సాగులో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులు

అండు కొర్ర సాగు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది. కనుమరుగవుతున్న దశలో ఆరోగ్య ఉపయోగాలరిత్యా తిరిగి అండుకొర్ర సమాజంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ పంట బెట్టను, వేడిని తట్టుకుంటుంది. లోతట్టు, వర, ముంపు ప్రాంతాల్లో కూడా సాగుకు అనుకూలం .

Andu Korra Cultivation Techniques

Korra Cultivation : వాతావరణ మార్పులు, పరిస్థితులు  వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. ప్రకృతి విధ్వంసం పెరిగిన భూతాపం . ఫలితం వర్షాకాలంలో కూడా వర్షాలకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగితే రేపటి రోజు తాగునీటికి ఇక్కట్లు తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో నీరుకట్టి పంటలు పండించడం అసాధ్యమవుతుంది. అందుకే ఇప్పటినుంచే ప్రత్యామ్నాయంగా రైతులు తక్కువ నీటితో పండే పంటలు , వర్షాధారిత పంటలవైపు మల్లడం మంచిది. ఇది రైతుకు , సమాజానికి శ్రేయస్కరం. నీటి అవసరం అంతగా లేని కోవలో ముందు వరుసలో ఉండేవి చిరుధాన్యాలు. ముఖ్యంగా మార్కెట్ లో అండు కొర్రలకు మంచి డిమాండ్ ఉంది. సాగుచేయాలనుకునే రైతులకు సరైన సమయం ఇదే..

READ ALSO : Organic Farming : సేంద్రీయ రైతుల హోటల్.. ఇక్కడ తింటే ఆరోగ్యం పదిలం

అండు కొర్ర ప్రాచీన, అరుదైన భారతదేశ ఆహారపంట. స్థానికి వన్య పంటల నుంచి రూపొందిందని ఆధారాలు తెలుపుతున్నాయి. తక్కువ నీటి లభ్యత కలిగిన, సారం లేని నెలల్లో సాగు చేస్తారు. వాతావరణ మార్పుల సంక్షోభాన్ని తట్టుకొని దిగుబడులనిస్తుంది. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గ్రామీణ పేదల్లో ఉన్న పోషక లోపాలను , పట్టణ , నగర ప్రజల్లో ఉన్న జీవనశైలి వ్యాధులకు అందుకొర్ర ఒక చక్కని పరిష్కారం.

READ ALSO : Organic Food : సేంద్రియ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్.. సేంద్రీయ ఉత్పత్తులతో హోటల్ నిర్వహిస్తున్న రైతులు

అండు కొర్ర సాగు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది. కనుమరుగవుతున్న దశలో ఆరోగ్య ఉపయోగాలరిత్యా తిరిగి అండుకొర్ర సమాజంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ పంట బెట్టను, వేడిని తట్టుకుంటుంది. లోతట్టు, వర, ముంపు ప్రాంతాల్లో కూడా సాగుకు అనుకూలం . వీటితో అన్నం, రొట్టె, గంజి చేసుకుంటారు. ప్రతికూల వాతావరణంలో కూడా పంట పండుతుంది. ముఖ్యంగా మే నుండి ఆగస్టు మాసాల్లో అండుకొర్ర విత్తనం వేసుకోవచ్చు. గొర్రుద్వారా విత్తనం వేస్తే సాళ్ల మధ్య 30 సెంటీ మీటర్లు ఉండేలా, మొక్కల మధ్య 7.5 సెంటీ మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి.

READ ALSO : Millets : చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే మిల్లెట్స్!

ఇందు కోసం 3 కిలోల విత్తనం సరిపోతుంది. అదే వెదజల్లే పద్దతిలో అయితే 5 కిలోల విత్తన అవసంరం. భూసార పరీక్ష ఆధారంగా ఎరువుల అవసరం ఉంటుంది. ఎకరాకి 4 టన్నుల పశువుల ఎరువును ఆకరి దుక్కిలో వేయాలి. 8 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం ఎరువులను విత్తేటప్పుడు వేయాలి. విత్తిన 25-30 రోజుల తరువాత మరో 8 కిలోల నత్రజనిని పైపాటుగా వేయాలి. అండు కొర్రను ఏకపంటగా, మిశ్రమ పంగాను సాగుచేసుకోవచ్చు.

READ ALSO : Mechanization in Paddy : వ్యవసాయంలో కూలీల కొరత.. అధిగమించేందుకు యాంత్రీకరణ

అండుకొర్ర స్వల్పకాలిక పంట. విత్తిన 75-85 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరాకు సగటున 7 నుండి8 క్వింటాల ధాన్యం దిగుబడితో పాటు 4 టన్నుల ఎండు చొప్ప దిగుబడి  వస్తుంది. అండుకొర్ర ధాన్యం నుండి కింటాకు కేవలం 40నుండి 45 కిలోల బియ్యం మాత్రమే వస్తాయి. అండుకొర్ర విత్తనం కావాలనుకునే రైతులు  నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో  సంప్రదించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు