Mr Pregnant : మిస్టర్ ప్రెగ్నెంట్ రివ్యూ.. అమ్మగా మారిన నాన్న.. ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించిన మిస్టర్ ప్రగ్నెంట్..

నేడు ఆగస్టు 18న మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌ (Mr Pregnant) అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సోహైల్.

Bigg Boss Fame Syed Sohel Mr Pregnant Movie Review and Audience Rating

Mr Pregnant Review : బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ (Syed Sohel) వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు ఆగస్టు 18న మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌ (Mr Pregnant) అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సోహైల్. రూపా కొడవాయుర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

కథ విషయానికి వస్తే చిన్నప్పుడే అమ్మ నాన్నలని పోగొట్టుకొని అనాధగా పెరిగిన హీరో లైఫ్ లోకి ప్రేమిస్తున్నాను అంటూ హీరోయిన్ వస్తుంది. ప్రగ్నెన్సీ వల్లే అమ్మ చనిపోయిందని పిల్లలు వద్దంటేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పినా హీరోయిన్ ఓకే చెప్పడంతో ఒక్కటవుతారు. కానీ పెళ్లి తర్వాత హీరోయిన్ కి ప్రగ్నెన్సీ రావడంతో మొదట తిట్టి ఆ తర్వాత ఏం చేయాలో తెలియక తాను ఆ ప్రగ్నెన్సీని తీసుకుంటాడు. హీరో ప్రెగ్నెంట్ గా మారిన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడు, ఎలాంటి పరిస్థితులని చూశాడు, చివరకు బిడ్డకు జన్మనిచ్చాడా లేదా అనేదే కథ.

మొదటి అరగంట క్యారెక్టర్స్ పరిచయం కోసం కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. ఇక చివరి 40 నిముషాలు మాత్రం అమ్మ గొప్పతనం, కొన్ని ఎమోషనల్ సీన్స్, ప్రెగ్నెన్సీ మహిళల కష్టాలు అన్ని చూపించి ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తారు. ఎమోషనల్ మ్యూజిక్, సాంగ్స్ కూడా బాగున్నాయి. ప్రెగ్నెంట్ గా సోహైల్ యాక్టింగ్ కోసం చాలా కష్టపడ్డాడు. హీరోయిన్ రూపా కూడా సోహైల్ కి సపోర్ట్ గా మెప్పిస్తుంది. సీనియర్ హీరోయిన్స్ సుహాసిని, కస్తూరి ముఖ్య పాత్రలు పోషించారు. సోహెల్ ఫ్రెండ్ గా వైవా హర్ష కూడా మెప్పిస్తాడు.

Baby OTT Release : ‘బేబీ’ మూవీ ఓటీటీ రిలీజ్‍పై అప్‍డేట్.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే..?

తెలుగులో ఇది కొత్త కాన్సెప్ట్. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న సోహైల్ చేశాడు అంటే ధైర్యం చేశాడనే చెప్పొచ్చు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ముఖ్యంగా మహిళలకు బాగా కనెక్ట్ అవుతుంది. సోహైల్ కెరీర్ లో హిట్స్, ఫ్లాప్స్ ఎన్ని వచ్చినా ఈ సినిమా మాత్రం ఒక స్పెషల్ సినిమాగా నిలిచిపోవడం ఖాయం.

ట్రెండింగ్ వార్తలు