Bihar BJP MLA: పోలీస్ కుర్చీలో కూర్చుని స్టేషన్లో కేసుల వివరాలు ఇవ్వాలంటూ బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్

ఓ ఎమ్మెల్యే..చట్టాన్ని మరిచి పోలీసుల వద్దనే దర్పాన్ని ప్రదర్శించి.. ఏకంగా పోలీస్ స్టేషన్లో అధికారి కుర్చీలోనే కూర్చున్న ఘటన బీహార్ లోని దర్బంగా జిల్లాలో చోటుచేసుకుంది.

Bihar BJP MLA: అధికారంలో ఉన్నాం కదాని ఓ ఎమ్మెల్యే..చట్టాన్ని మరిచి పోలీసుల వద్దనే దర్పాన్ని ప్రదర్శించి.. ఏకంగా పోలీస్ స్టేషన్లో అధికారి కుర్చీలోనే కూర్చున్న ఘటన బీహార్ లోని దర్బంగా జిల్లాలో చోటుచేసుకుంది. బీహార్ కు చెందిన అధికార బీజేపీ ఎమ్మెల్యే మురారి మోహన్ ఝా ఇటీవల తన కేయోతి నియోజకవర్గానికి వెళ్ళాడు. ఎమ్మెల్యే వచ్చాడన్న సంగతి తెలుసుకున్న స్థానికులు..పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే మురారి వద్ద మొరపెట్టుకున్నారు. ఇటీవల కేయోతిలో జరిగిన ఇరువర్గాల ఘర్షణలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని..ఇద్దరు వ్యక్తులను పోలీసులు అకారణంగా కొట్టారంటూ స్థానికులు ఎమ్మెల్యే మురారి దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే..మీడియాను వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. ఏకంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే..మా అనుచరులను ఎందుకు కొట్టారంటూ పోలీసులను ప్రశ్నించాడు.

Also read:Hyd Police : రాత్రి కలగంటాడు.. పగలు కొట్టేస్తాడు, 30 ఏళ్లుగా దొంగతనాలు

ఈ గొడవకు సంబంధించి స్టేషన్ లో ఉన్న కేస్ డైరీని చూపించాలంటూ ఎమ్మెల్యే మురారి కాసేపు హంగామా సృష్టించాడు. పై అధికారికి ఫోన్ చేసి పోలీసు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ఎమ్మెల్యే. తమ గ్రామంలో యువకుడిని ఎస్సై ఎందుకు కొట్టాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని, లేదంటే ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదంటూ ఎమ్మెల్యే మురారి మోహన్ ఝా భీష్మించుకు కూర్చున్నారు. ఉన్నతాధికారి వచ్చి స్టేషన్ డైరీ చూపించాలని, లేని పక్షంలో ఘటనకు బాధ్యత వహిస్తూ ఎస్సై బాధిత యువకులకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే మురారి డిమాండ్ చేశాడు. అదే సమయంలో ఎస్సై పై గ్రామస్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేయగా..యువకులను కొట్టిన ఘటనపై ఎస్సై..ఎమ్మెల్యే సమక్షంలో క్షమాపణ కోరాడు. దీంతో గొడవ సద్దుమణిగింది.

Also read:Swiggy Boy: ప్రేమికుల మధ్య గొడవ: పరిష్కరించడానికి వెళ్లి యువతిని కొట్టిన స్విగ్గీ డెలివరీ బాయ్

అక్కడ మీడియా కూడా ఉండడంతో సంయమనం పాటించిన పోలీసులు..మీడియా ఎదుట డైరీ చూపించడం చట్టవిరుద్ధమని..జరిగిన ఘటనపై పూర్తి వివరణ ఇస్తామంటూ పోలీసులు ఎమ్మెల్యేను శాంతపరిచారు. అయితే స్టేషన్ హౌస్ ఆఫీసర్ కుర్చీలో కూర్చున్న ఎమ్మెల్యే పోలీసుల ఎదుట దర్పాన్ని ప్రదర్శించడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈఘటన తాలూకు దృశ్యాలను ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే రూల్స్ మర్చిపోయి పోలీస్ సీట్లో కూర్చోవడం ఏంటంటూ తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. బీహార్ లో ఎన్డీఏ పాలన లేదని..సర్కస్ జరుగుతుందని ప్రభుత్వాన్ని విమర్శించారు తేజస్వీ.

Also read:Anand Mahindra: బుడతడు చేపలు పట్టే విధానంలో “విజయాన్ని చూసిన” ఆనంద్ మహీంద్రా: వైరల్ వీడియో

ట్రెండింగ్ వార్తలు