Bombay High Court : మోసపూరిత ఖాతాల ప్రకటనపై బ్యాంకర్లకు ఎదురుదెబ్బ.. ఆర్బీఐ మాస్టర్ సర్క్యూలర్లపై బాంబే హైకోర్టు స్టే

ఆర్బీఐ మాస్టర్ సర్క్యూలర్లు అన్యాయంగా ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. ఏ ప్రాతిపదికన రుణ గ్రహీతల ఖాతాలను బ్యాంకులు మోసపూరిత ఖాతాలుగా తేల్చుతున్నాయని ప్రశ్నించారు.

Bombay High Court (1)

RBI Master Circulars : మోసపూరిత ఖాతాల ప్రకటనపై బ్యాంకర్లకు ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) జారీ చేసిన మాస్టర్ సర్క్యూలర్లపై బాంబే హైకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది. దీంతో ఎలాంటి విచారణ లేకుండానే ఇకపై బ్యాంకులు ఏ ఖాతానూ మోసపూరిత ఖాతా అని ప్రకటించకుండా అడ్డుకున్నట్లైంది.

జెట్ ఎయర్ వేస్ మునుపటి ప్రమోటర్లు నరేశ్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్ సహా మరికొంతమంది దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ గౌతమ్ పటేల్, జస్టిస్ నీలా గోఖలేతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేప్టటింది. ఈ క్రమంలోనే బాంబే హైకోర్టు స్టే ఇచ్చింది. సెప్టెంబర్ 11 వరకు ఇది వర్తిస్తుంది.

Madhya Pradesh : ప్రేమ పెళ్లి చేసుకున్న యువ జంట దారుణ హత్య.. మృతదేహాలను మొసళ్లున్న నదిలో పారవేత

ఆర్బీఐ మాస్టర్ సర్క్యూలర్లు అన్యాయంగా ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. ఏ ప్రాతిపదికన రుణ గ్రహీతల ఖాతాలను బ్యాంకులు మోసపూరిత ఖాతాలుగా తేల్చుతున్నాయని ప్రశ్నించారు. కాగా, సెప్టెంబర్ 7,8 తేదీల్లో ఈ కేసు మళ్లీ విచారణకు రానుంది.

ట్రెండింగ్ వార్తలు