Brijbhushan Sharan Singh: నేను నార్కో పరీక్షకు సిద్ధం.. రెజ్లర్లు సిద్ధమా? బ్రిజ్ భూషణ్ సంచలన ప్రకటన

బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ఫేస్‌బుక్ పోస్టు ప్రకారం.. నార్కో టెస్టుతో పాటు పాలిగ్రాఫ్, లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే ఇందుకోసం ఓ షరతు పెట్టారు.

Wrestlers vs Brijbhushan: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షులు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్  (MP Brijbhushan Sharan Singh), రెజర్ల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. గత కొద్ది నెలల క్రితం రెజ్లర్లు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌పై బహిరంగంగా లైంగిక ఆరోపణలు చేశారు. అతన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని, కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్న విషయం విధితమే. సుప్రీంకోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ పై ఫోక్సో చట్టంతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Wrestlers vs WFI: 2014లోనే రిటైర్ అవుదామనుకున్నాను: బ్రిజ్ భూషణ్

గత నెల రోజులుగా డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat), బజరంగ్ పునియా (Bajrang Punia), సాక్షి మాలిక్ (Sakshi Malik) లతో పాటు పలువురు మహిళా రెజర్లు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విషయం విధితమే. రైతు సంఘాలుసైతం వారికి మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో హరియాణాలో ఆదివారం ఖాప్ పంచాయితీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్రిజ్ భూషణ్ కు నార్కో పరీక్షలు నిర్వహించాలని ఖాప్ పంచాయితీ పెద్దలు తీర్మానించారు. వారి తీర్మానానికి బ్రిజ్ భూషణ్ స్పందించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా నార్కో టెస్టు విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Wrestlers vs WFI: దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నా WFI చీఫ్‌పై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు.. బ్రిజ్ భూషణ్ ఎవరు?

బ్రిజ్ భూషణ్ ఫేస్‌బుక్ పోస్టు ప్రకారం.. నార్కో టెస్టుతో పాటు పాలిగ్రాఫ్, లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధంగా ఉన్నాను. అయితే.. ఇందుకు ఓ షరతు. నాతోపాటు రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియాలకుకూడా ఈ పరీక్ష నిర్వహించాలని నేను డిమాండ్ చేస్తున్నా. అందుకు వారు సిద్ధమైతే మీడియా ముందు ప్రకటించాలి. వారు నార్కో పరీక్షకు సిద్ధమైతే నేనూ సిద్ధమే అంటూ బ్రిజ్ భూషణ్ ప్రకటించారు.

Wrestlers: మాకు వచ్చిన మెడల్స్ అన్నింటినీ వెనక్కి ఇచ్చేస్తాం: రెజ్లర్లు

నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎంపీ బ్రిజ్ భూషణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “రాజకీయాల నుంచి వైదొలగాలని 2014లోనే అనుకున్నాను. కానీ, 2014 లోక్‌సభ ఎన్నికలవేళ అమిత్ షా అందుకు నాకు అనుమతి ఇవ్వలేదు అని చెప్పారు. తనపై మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ స్పందిస్తూ… “ఎవరైనా అసత్యాలు చెప్పాలని నిర్ణయం తీసుకుంటే వారిని అలాగే ముందుకు వెళ్లనివ్వండి” అని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనపై ఇలాంటి ఆరోపణలు వారు చేస్తున్నారని బీజేపీ ఎంపీ విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు