Meenakshi Lekhi: పార్లమెంటులో ఈడీ గురించి మాట్లాడి అడ్డంగా ఇరుక్కున్న కేంద్ర మంత్రి

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీనాక్షీ లేఖి చేసిన ప్రసంగంలో కొందరు ప్రతిపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేసిందని అన్నారు

Parliament Monsoon Session: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వారి ఇళ్లకు రాకుండా ఉండాలంటే ప్రతిపక్ష ఎంపీలు తమ ప్రసంగాలను అడ్డుకోవడం మానుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి హెచ్చరించారు. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థల్ని మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న విమర్శల నేపథ్యంలో గురువారం (ఆగస్టు 3) లోక్‌సభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెను, భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టాయి.

Chandrababu Naidu: చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ అధినేత

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీనాక్షీ లేఖి చేసిన ప్రసంగంలో కొందరు ప్రతిపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేసిందని అన్నారు. దీనికి లేఖి సమాధానమిస్తూ.. ‘ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండండి, ఈడీ మీ ఇంటికమీ రాదు’ అని ప్రతిపక్ష ఎంపీలను ఉద్దేశించి అన్నారు. అయితే ఈ ప్రకటనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కాగా.. హాస్యాస్పదంగా అన్నానని లేఖి సమాధానం ఇచ్చారు.

Manthani Constituency: మంథనిలో కాంగ్రెస్ ధీమా.. మరో చాన్స్ ఇవ్వమంటున్న మధు.. బీజేపీ పరిస్థితి ఏంటి?

లేఖి ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ.. ‘‘మోదీ ప్రభుత్వంలో అధికార మత్తులో ఉన్న మంత్రి మీనాక్షి లేఖిని చూడండి. నకిలీ ఈడీ దాడులతో ఆమె పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎంపీలను బహిరంగంగా బెదిరిస్తున్నారు. విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రధాని మోదీ ఈడీ దాడులను దుర్వినియోగం చేస్తున్నారని ఈ బెదిరింపు ప్రకటన ద్వారా స్పష్టమైంది’’ అని విమర్శలు గుప్పించారు.

Narendra Modi: ఆగస్టు 6న రికార్డు సృష్టించేందుకు సిద్ధమైన ప్రధాని మోదీ.. ఇంతకీ ఆరోజు ఏం చేయనున్నారో తెలుసా?

మీనాక్షి లేఖి ప్రకటనను టీఎంసీ, కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు కూడా ఖండించాయి. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాల నోరు మూయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడి కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తోందని విపక్ష నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. ఇక నెట్టింట్లో ఆమెపై పెద్ద ట్రోల్స్ వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు