Ponniyin Selvan : హీరోకి బొట్టు ఉందని మణిరత్నం సినిమాపై కేసు నమోదు..

మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమా వివాదాల్లో చిక్కుకుంటుంది. ఈ సినిమా చోళుల కథ ఆధారంగా తెరకెక్కించింది అని అందరికి తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ..............

Manirathnam :  మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యరాయ్‌, కార్తి, త్రిష, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల, ప్రభు.. ఇలా చాలా మంది స్టార్లు నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్‌ దీనికి సంగీతం అందిస్తున్నారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా పొన్నియిన్ సెల్వన్ సినిమా రాబోతుంది. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్, ఇందులో ప్రముఖ పాత్రల లుక్స్ విడుదల చేయగా సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.

అయితే ఇప్పుడు మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమా వివాదాల్లో చిక్కుకుంటుంది. ఈ సినిమా చోళుల కథ ఆధారంగా తెరకెక్కించింది అని అందరికి తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ సెల్వన్‌ అనే ఓ న్యాయవాది దర్శకుడు మణిరత్నం, ఆదిత్య కరికాలన్‌ పాత్ర పోషిస్తున్న విక్రమ్‌లకు లీగల్‌ నోటీసులు పంపారు. ఆ నోటీసుల్లో.. చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్‌లో ఆదిత్య కరికాలన్‌ పాత్ర పోషించిన విక్రమ్‌ తిలకం ధరించి ఉన్నారు. చోళులు ఎప్పుడూ తిలకం ధరించినట్టు ఆధారాలు లేవని, మణిరత్నం చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని న్యాయవాది సెల్వం ఆరోపించారు. చరిత్రని తప్పుదోవ పట్టించే అవకాశం ఉన్నందున సినిమా విడుదలకు ముందే చూపించాలని ఈ నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులపై అటు మణిరత్నం కానీ, ఇటు విక్రమ్‌ కానీ స్పందించలేదు.

Dil Raju : నెల రోజుల్లో ఇండస్ట్రీని కొత్తగా చూస్తారు.. సినీ సమస్యలపై.. దిల్ రాజు స్పెషల్ ఇంటర్వ్యూ..

మరోవైపు చిత్ర యూనిట్ చోళ రాజుల గురించి, వారు సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ స్పెషల్‌ వీడియోను ప్రమోట్ చేస్తుంది. చరిత్రకారులు, పరిశోధకులు చోళ రాజుల వైభవం గురించి, చోళుల కాలం గురించి గొప్పగా చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు