Chiranjeevi : రవితేజని మర్చిపోయాను.. చాలా ఫీల్ అయ్యాను.. రవితేజ లేకపోతే వాల్తేరు వీరయ్య లేదు..

ప్రెస్ మీట్ లో చిరంజీవి హడావిడిలో రవితేజ గురించి మాట్లాడటం మర్చిపోయాడు. దీంతో ఈ విషయంలో ఫీల్ అవుతూ రవితేజ గురించి స్పెషల్ ట్వీట్ చేశాడు మెగాస్టార్. చిరంజీవి ఈ ట్వీట్ లో.............................

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి మరింత యంగ్ గా, మరింత ఎనర్జీగా కనిపిస్తుండం, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి.

తాజాగా వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి చిరంజీవి, రవితేజ, ఊర్వశి రౌతేలా, డైరెక్టర్ బాబీ, దేవిశ్రీ ప్రసాద్, రాజేంద్రప్రసాద్, నిర్మాతలు.. చిత్రయూనిట్ అంతా విచ్చేసి మాట్లాడారు. వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి జనవరి 13న రిలీజ్ కానుంది. సినిమా గురించి పలువురు అనేక విషయాలని పంచుకున్నారు ఈ ప్రెస్ మీట్ లో. అయితే ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడతామని అన్నారు.

Chiranjeevi : అలా చేయలేనప్పుడు సినిమాల నుంచి రిటైర్ అయిపోవాలి..

అయితే ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి హడావిడిలో రవితేజ గురించి మాట్లాడటం మర్చిపోయాడు. దీంతో ఈ విషయంలో ఫీల్ అవుతూ రవితేజ గురించి స్పెషల్ ట్వీట్ చేశాడు మెగాస్టార్. చిరంజీవి ఈ ట్వీట్ లో.. వాల్తేరు వీరయ్య టీం అందరితో, మీడియా మిత్రులందరి కోసం ఏర్పాటు చేసిన ఈ నాటి ప్రెస్ మీట్ ఎంతో ఆహ్లదకరంగా జరిగింది. చిత్రం విడుదలకు ఎంతో ముందు జరిగినా, టీం అందరూ ఎంతో సంతోషంగా ఈ జర్నీలో వాళ్ళ వాళ్ళ మెమరీస్ పంచుకోవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంత సంతృప్తిగా అంది. అయితే నా వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగా మాట్లాడదామని అనుకోవడంలో చిత్రంగా నా తమ్ముడు, వీరయ్యకి అతి ముఖ్యుడు, రవితేజ గురించి చెప్పడం మర్చిపోయాను. వచ్చేటప్పుడు అంతా ఈ విషయమై వెలితిగా ఫీలయ్యి ఈ ట్వీట్ చేస్తున్నాను. ప్రాజెక్టు గురించి చెప్పగానే అన్నయ్య సినిమాలో చేయాలని రవి వెంటనే ఒప్పుకోవడం దగ్గర్నుంచి, కలిసి షూట్ చేసిన ప్రతి రోజూ రవితో మళ్ళీ ఇన్నేళ్లకి చేయడం నాకెంతో ఆనందంగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రవితేజ చేయకపోయుంటే వాల్తేరు వీరయ్య అసంపూర్ణంగా ఉండేది. డైరెక్టర్ బాబీ అంటున్న పూనకాలు లోడింగ్ లో రవితేజ పాత్ర చాలా ఉంది. ఆ విషయాలు త్వరలో మాట్లాడుకుందాం అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు