NTR – Vishwak : ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాని రీమేక్ చేస్తానంటున్న విశ్వక్ సేన్.. ఎందుకు బ్రో?

ఇంటర్వ్యూలో సుమ విశ్వక్ ని ఒకవేళ ఎన్టీఆర్ సినిమా రీమేక్ చేస్తే ఏ సినిమా చేస్తావు అని అడగ్గా..

NTR – Vishwak Sen : యువ హీరోల్లో విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు. ఓ పక్క మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తూ మరో పక్క కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ కి పెద్ద అభిమాని అని చెప్పుకుంటూ ఎన్టీఆర్ ని తన ఈవెంట్స్ కి పిలిచి, ఎన్టీఆర్ అభిమానులకు దగ్గరవుతూ ఎన్టీఆర్ అభిమానులను కూడా తన అభిమానులుగా మార్చుకున్నాడు.

త్వరలో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari) సినిమాతో రాబోతున్నాడు విశ్వక్ సేన్. మే 31న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమతో మూవీ యూనిట్ ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సుమ విశ్వక్ ని ఒకవేళ ఎన్టీఆర్ సినిమా రీమేక్ చేస్తే ఏ సినిమా చేస్తావు అని అడగ్గా విశ్వక్ సమాధానమిస్తూ.. ‘నా అల్లుడు’ అని చెప్పాడు. దీంతో సుమ షాక్ అయింది. అయితే ఆ సినిమాకి కొంచెం ఛేంజెస్ చేసి తీయొచ్చు, ఆ సినిమా బాగుంటుంది అని తెలిపాడు విశ్వక్.

Also Read : Anand Mahindra : ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై ఆనంద్ మహీంద్రా పొగడ్తలు.. బుజ్జిని తయారుచేసింది వాళ్ళే..

ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమాల్లో ఒకటైన నా అల్లుడు సినిమా విశ్వక్ రీమేక్ చేస్తాడు అని చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతూ ఆ సినిమా ఎందుకు రీమేక్, ఫ్లాప్ సినిమాని మళ్ళీ ఎందుకు గుర్తుచేస్తావు బ్రో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే ఇప్పుడు రీమేక్ చేస్తే రమ్యకృష్ణ, జెనీలియా, శ్రియ పాత్రల్లో ఎవరిని తీసుకుంటావు అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమా నా అల్లుడు రీమేక్ చేస్తాను అని విశ్వక్ చెప్పడంతో ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు