Anand Mahindra : ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై ఆనంద్ మహీంద్రా పొగడ్తలు.. బుజ్జిని తయారుచేసింది వాళ్ళే..

తాజాగా ఆనంద్ మహీంద్రా కల్కి బుజ్జి వెహికల్ తో పాటు, గతంలో నాగ్ అశ్విన్ తో మాట్లాడిన ట్వీట్స్ కూడా పోస్ట్ చేసి..

Anand Mahindra : ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై ఆనంద్ మహీంద్రా పొగడ్తలు.. బుజ్జిని తయారుచేసింది వాళ్ళే..

Anand Mahindra Appreciated Kalki Director Nag Ashwin and who Prepare Bujji Vehicle

Anand Mahindra : కల్కి(Kalki) సినిమాలో ప్రభాస్ వాడే వాహనం బుజ్జిని(Bujji) ఇటీవల గ్రాండ్ ఈవెంట్ పెట్టి మరీ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఓ సరికొత్త వెహికల్ గా ఈ బుజ్జి కనిపించింది. కల్కి సినిమాలో యాక్షన్ సీన్స్ లో ఈ వెహికల్ ని ఓ రేంజ్ లో వాడినట్టు తెలుస్తుంది. అయితే ఈ వెహికల్ ని మహీంద్రా కంపెనీ తయారుచేసిందని అందరికి తెలిసిందే. గతంలో కల్కి సినిమా మొదలయ్యే సమయంలో నాగ్ అశ్విన్ ట్విట్టర్ లో ఆనంద్ మహీంద్రాకు ట్వీట్ చేసి ఈ సినిమా కోసం ఓ స్పెషల్ వెహికల్ తయారుచేయాలనుకుంటున్నాం నాకు మీ సహాయం కావాలి అని అడిగారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ట్యాలెంట్ ఎక్కడున్నా వారికి సపోర్ట్ గా నిలిచే ఆనంద్ మహీంద్రా నాగ్ అశ్విన్ కి సహాయం చేస్తాను అని చెప్పి చెన్నైలో తమ వెహికల్స్ తయారుచేసే టీమ్ కి చెప్పి నాగ్ అశ్విన్ వర్క్ అయ్యేలా చేసారు. కల్కి బుజ్జి లాంచింగ్ ఈవెంట్లో కూడా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ మహీంద్రా కంపెనీలోని ఉద్యోగుల వల్లే ఈ వాహనం సాధ్యమైందని తెలిపారు.

Also Read : Vaishnavi Chaitanya : డీజే టిల్లుతో ముస్లిం అమ్మాయిగా నటించబోతున్న బేబీ..

తాజాగా ఆనంద్ మహీంద్రా కల్కి బుజ్జి వెహికల్ తో పాటు, గతంలో నాగ్ అశ్విన్ తో మాట్లాడిన ట్వీట్స్ కూడా పోస్ట్ చేసి.. నిజానికి సరదా సంగతులు ఎక్స్‌లోనే కనిపిస్తాయి. నాగ్ అశ్విన్, అతని టీం చాలా గొప్పగా ఆలోచించడానికి భయపడరు, దానికి నేను గర్విస్తున్నాను. ఈ వాహనాన్ని తయారుచేయడానికి చెన్నైలోని మా మహీంద్రా టీమ్ కల్కి టీమ్ కు సపోర్ట్ చేసింది. బుజ్జి వాహనం రెండు మహీంద్రా ఈ – మోటార్స్ తో నడుస్తుంది. జయం ఆటోమోటివ్స్ కూడా ఈ వెహికల్ తయారుచేయడంలో భాగమైంది అని తెలిపారు. ఇక ఈ వెహికల్ తయారుచేయడానికి దాదాపు 7 కోట్లు పట్టిందని సమాచారం.

ఆనంద్ మహీంద్రా ఈ రేంజ్ లో నాగ్ అశ్విన్ ని పొగడటంతో అభిమానులు కూడా మరోసారి అభినందిస్తున్నారు. ఇక కల్కి బుజ్జి వాహనం బాగా వైరల్ అయింది. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ చేయబోతున్నారు. ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన కల్కి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.