Vaishnavi Chaitanya : డీజే టిల్లుతో ముస్లిం అమ్మాయిగా నటించబోతున్న బేబీ..

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా యాక్షన్ ఎంటర్టైనర్ గా 'జాక్' సినిమా ఇటీవల ప్రకటించారు.

Vaishnavi Chaitanya : షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో మెప్పించిన వైష్ణవి చైతన్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా మొదటి సినిమా బేబీ తోనే భారీ హిట్ కొట్టింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న వైష్ణవి చైతన్య రేపు మే 25న ‘లవ్ మీ'(Love Me) అనే సినిమాతో రాబోతుంది. ఆశిష్, వైష్ణవి జంటగా దయ్యంతో హీరో ప్రేమలో పడే కథాంశంతో హారర్ థ్రిల్లర్ సినిమాగా ఈ లవ్ మీ సినిమా రాబోతుంది.

ఈ క్రమంలో మూవీ యూనిట్ పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే బేబీ సినిమా సమయం నుంచి వైష్ణవి చైతన్యని పలువురు ఆంధ్రా అమ్మాయి అయినా తెలంగాణ అమ్మాయిలా మాట్లాడటానికి ట్రై చేస్తుంది అంటూ విమర్శలు చేశారు. గతంలోనే వీటికి క్లారిటీ ఇస్తూ నేను హైదరాబాద్, తెలంగాణ అమ్మాయినే అని చెప్పింది. తాజాగా వైష్ణవి చైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నన్ను చాలా మంది విజయవాడ అమ్మాయి అనుకుంటారు. నేను పక్కా హైదరాబాదీ, ఓల్డ్ సిటీ, చాంద్రయాణ్ గుట్ట అమ్మాయిని. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. తర్వాత సిద్ధూ జొన్నలగడ్డతో చేయబోయే జాక్ సినిమాలో ముస్లిం అమ్మాయిగా కూడా నటిస్తున్నాను అని తెలిపింది.

Also Read : Jabardasth Stars : జబర్దస్త్ రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, సుధీర్ కలిసి మరో సినిమా.. కానీ ఈసారి డైరెక్టర్ గా మారబోతున్న..

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘జాక్’ సినిమా ఇటీవల ప్రకటించారు. వైష్ణవి ఓల్డ్ సిటీ అమ్మాయి, పక్కా హైదరాబాదీ అమ్మాయి అని చెప్పడం, జాక్ సినిమాలో ముస్లిం పాత్ర చేస్తున్నాను అని చెప్పడంతో ఆ పాత్రలో కూడా వైష్ణవి అదరగొడుతుందని భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు