Anne Hathaway : RRR టీంతో కలిసి పనిచేయాలని ఉంది అంటున్న ఆస్కార్ విన్నర్ హాలీవుడ్ నటి..

ఎంతోమంది హాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ RRR సినిమాపై, రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.

Anne Hathaway : రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్ గా చేసిన RRR సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. హాలీవుడ్ లో కూడా RRR సినిమా పెద్ద హిట్ అయి అక్కడి సినీ పరిశ్రమని ఆశ్చర్యపరిచింది. బెస్ట్ సాంగ్ ఆస్కార్ అవార్డు కూడా గెలిచి చరిత్ర సృష్టించింది. ఎంతోమంది హాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ RRR సినిమాపై, రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి హాలీవుడ్ లో పని చేయాలని, రాజమౌళితో పని చేయాలని ఉందని, చరణ్, ఎన్టీఆర్ లతో కూడా వర్క్ చేయాలని ఉందని అనేకమంది హాలీవుడ్ నటీనటులు కామెంట్స్ చేశారు.

తాజాగా మరో హాలీవుడ్ నటి, ఆస్కార్ విన్నర్ అన్నే జాక్వెలిన్ హాత్‌వే RRR టీంతో కలిసి పనిచేయాలని ఉందని అంటుంది. ఇంటర్ స్టెల్లార్, బ్రైడ్ వార్స్, పాసెంజర్స్, లెస్ మిసెర్బుల్స్, ది ఇంటర్న్.. లాంటి ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో నటించిన అన్నే జాక్వెలిన్ హాత్‌వే తాజాగా ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ RRR సినిమా గురించి స్పందించింది.

Also Read : NTR – Vishwak : ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాని రీమేక్ చేస్తానంటున్న విశ్వక్ సేన్.. ఎందుకు బ్రో?

అన్నే జాక్వెలిన్ హాత్‌వే మాట్లాడుతూ.. అందరికి నచ్చినట్టే RRR సినిమా నాకు కూడా చాలా నచ్చింది. RRR టీంలో ఎవరితోనైనా కలిసి పనిచేయాలనుకుంటున్నాను అని తెలిపింది. దీంతో అన్నే వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరోసారి నెటిజన్లు RRR సినిమాని, ఆ సినిమాని అందరికి రీచ్ అయ్యేలా తెరకెక్కించిన రాజమౌళిని అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు