Ananya Nagalla : ఓ రేంజ్‌లో కర్రసాము చేస్తున్న అనన్య నాగళ్ళ.. వీడియో వైరల్..

అనన్య నాగళ్ళ కర్రసాము చేస్తున్న వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Ananya Nagalla : అనన్య నాగళ్ళ.. ఒక పక్క హీరోయిన్‌గా, మరో పక్క సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తుంది. ఇటీవలే తంత్ర అనే హారర్ సినిమాతో మంచి విజయం అందుకుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ఫోటోలు పోస్ట్ చేస్తూ అందాలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. తాజాగా అనన్య నాగళ్ళ షేర్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది.

Also Read : Anne Hathaway : RRR టీంతో కలిసి పనిచేయాలని ఉంది అంటున్న ఆస్కార్ విన్నర్ హాలీవుడ్ నటి..

అనన్య నాగళ్ళ కర్రసాము చేస్తున్న వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మన ఊళ్ళల్లో కర్రసాము చేసే విధంగానే ఓ రేంజ్ లో చేస్తుంది అనన్య. అయితే ఇది కర్రసాము ప్రాక్టీస్ చేస్తున్న వీడియో. ఏదైనా సినిమా కోసం అనన్య కర్రసాము నేర్చుకుంటుందేమో అని అనుకుంటున్నారు. యాక్టింగ్ తో పాటు కర్రసాము కూడా బాగానే చేస్తుంది అని మెచ్చుకుంటున్నారు అభిమానులు, నెటిజన్లు. అనన్య నాగళ్ళ కర్రసాము ప్రాక్టీస్ వీడియో మీరు కూడా చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు